పోలీస్ యూనిఫామ్ త్యాగానికి ప్రతీక...



పోలీస్ అమరవీరుల సంస్మరణ స్మారకోత్సవాలలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో విద్యార్థులకు పోలీసుశాఖ అందించే సేవలపై “ఓపెన్ హౌస్” నిర్వహణ.



ఈ ఓపెన్ హౌస్ లో మొదటిసారిగా “సైబర్ అవేర్నెస్” ఫ్ల కార్డులను వినూత్నంగా ప్రదర్శించిన జిల్లా సైబర్ క్రైమ్ పోలీసు వారు.



పోలీసుశాఖ వినియోగించే ఆయుధాలు, టెక్నాలజీ, డ్రోన్స్, డాగ్స్ స్క్వాడ్, సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించిన జిల్లా పోలీసుశాఖ.



జిల్లా అంతట వ్యాసరచన పోటీలు, అవగాహన కార్యక్రమాలు, మానవహారాలు మరియు ర్యాలీలు నిర్వహణ.



పోలీస్ యూనిఫామ్ త్యాగానికి ప్రతీక...తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్.,



జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ "ఓపెన్ హౌస్" కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి, ఓపెన్ హౌస్ ను ప్రారంభించినారు. అనంతరం జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు మరియు ఇతర పోలీసు అధికారులు 'ఓపెన్ హౌస్ 'ను సందర్శించి, విద్యార్థులతో మమేకమై, విద్యార్థులతో అప్యాయంగా మాట్లాడి, పోలీసుశాఖ వినియోగించే వివిధ ఆయుధాలు, అత్యాధునిక పరికరాలు, సాంకేతికత పట్ల అవగాహన కల్పించి, వారిలో స్ఫూర్తి నింపారు.



జిల్లాలో ఈ నెల 21 వ తేదీ నుండి 31 వరకు నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ స్మారకోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ డి. కిషోర్ ఐ.పీ.ఎస్., ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో విద్యార్థులకు పోలీసుశాఖ అందించే సేవలపై “ఓపెన్ హౌస్” నిర్వహించినారు. ఈ ఓపెన్ హౌస్ లో మొదటిసారిగా “సైబర్ అవేర్నెస్” ఫ్ల కార్డులను, అవగాహన వీడియోలను వినూత్న రీతిలో ప్రదర్శించి విద్యార్థులను ఆకట్టుకున్న జిల్లా సైబర్ క్రైమ్ పోలీసు వారు.



ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ, వారు చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు జోహార్లు తెలిపారు. భారతదేశం చాలా గొప్ప దేశమని, అటువంటి దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిలబడే ఏకైక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అని అన్నారు. అటువంటి పోలీసులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. ప్రతి ఒక్క పౌరుడు తమకు తెలిసిన సమాచారాన్ని పోలీసు వారికి అందించి, సహకరించాలని విజ్ఞప్తి చేసినారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో సుమారు 500 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారని అన్నారు.



ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ( లా అండ్ ఆర్డర్)  అల్లూరి వెంకట సుబ్బరాజు, ఇన్స్పెక్టర్( ఎస్ బి)  అనసూరి శ్రీనివాసరావు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, అధ్యాపకులు, మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.