ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించటం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సు కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు & ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు.
అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి & రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, ఎన్నికల సంఘం మరియు పత్రికా సమావేశాలు సమన్వయకర్త & మాజీ మంత్రివర్యులు దాడి వీరబద్రరావు, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, పీలా గోవింద సత్యనారాయణ, దాడి వీర భద్రారావు, బుద్ధా నాగ జగదీశ్వర రావు మొదలైన నాయకులు మాట్లాడుతూ గతంలో సభ్యత్వ నమోదు రూ.100/- రూపాయలకి గాను 2 లక్షల రూపాయలు భీమ ఉండేది. ఇప్పుడు అదే రూ.100/- రూపాయలకి గాను 5 లక్షల రూపాయిలకు గాను భీమా పెంచడం జరిగింది.
కాబట్టి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలోనే అనకాపల్లి నియోజకవర్గం అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయించాలని నాయకులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి వివిధ హోదాల్లో ఉన్న అన్ని అనుబంధ కమిటీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, టీడీపి సీనియర్ నాయకులు క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జిలు తదితర నాయకులు కార్యకర్తలు మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.