ఆశా సమీక్షా సమావేశం లో ఆయుష్ పై శిక్షణా కార్యక్రమం

 


5-11-2024 వ తేదీన స్థానిక సీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఆశాకార్యకర్తల సమావేశం డా,,SK మస్తాన్ వలీ వైద్యాధికారి అధ్యక్షత వహించారు.అజెండాను ఆశా కార్యకర్తలకు, వైద్య సిబ్బందికి,అంగన్వాడీ కార్యకర్తలకు కూలంకషంగా విషదపరచినారు. శిశువుల పెరుగుదల, ఆరోగ్య అభివృద్ధి, వారికి సంక్రమించే న్యూమోనియా నియంత్రణ, ఆరోగ్యానికి అవదిగా ఇంటిలోనూ, ఆరుబయట ఎయిర్ పూల్యూషణ నుండి రక్షణ,వ్యాధి సంక్రమిస్తే త్వరితగతిని రిఫర్ చేయడం పై శిక్షణ ఇచ్చినారు.



కుటుభనియంత్రణ లో తాత్కాలిక పద్ధతులు, గర్భవతులకు అందవలసిన లబ్ధిని సకాలంలో వారికి అందేలా సహకరించాలని హితవుపలికారు. HBNC,HBYC IMNCI వంటి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని, ఎర్లీ డయాగ్నోసిస్ లో భాగంగా నీచ్చాయ్ కిట్స్ ఉపయోగించి నాణ్యమైన రిపోర్ట్ సకాలం లో PHC అందజేయాలనియు, ఈ-అశా ఆప్ ను వినియోగించి అర్హులైన దంపతులను గణన చేయాలని,గర్భవతులకు ఐరన్ ఫోలిక్ ఆసిడ్ మాత్రల పంపిణీ గూర్చి, విటమిన్ ఎ అడ్మినిస్ట్రేషన్ గూర్చి తెలిపినారు. HBNC,HBYC, మరియు VHSND కమిటీలను జాగృతం చేయాలని కోరారు. గర్భవతులకు ప్రమాద సుచికలను అప్రమత్తం తో MO/ANM కు తెలియపరచాలని, గర్భవతిగా ఉన్న సమయంలో వారి రుగ్మతల ను, పురుడు పోసుకున్న తరువాత వారిరుగ్మతలను వైధ్యాధికారి దృష్టి కి తీసుకు రావాలని ఆదేశించినారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఆయుష్ విభాగం,ఆశా కార్యకర్తల శిక్షణా కార్య క్రమాన్ని ఆయుర్వేద వైద్యాదికారి డా,,G.రవికుమార్ నిర్వహించి సాధారణ వ్యాధులతో పాటు మధుమేహ నియంత్రణలో ఆశా కార్యకర్తల పాత్ర గూర్చి తెలిపినారు. సదరు కార్యక్రమం లో వైద్యాధికారి అరోగ్య విష్టరణాధికారి కె. జోజి బాబు, అరోగ్య పర్యవేక్షకులు త్రినాథరావు, బలమని, ఐసీడీఎస్ సూపర్వైజర్ మోహిని, ఆరోగ్యకార్యకర్త రాజబాబు, ఆరోగ్యకార్యకర్థలు, అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.