ముఖ్య విజ్ఞప్తి

ఎపిఎమ్ఎఫ్   రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిల్లి బాబు రెడ్డి  అధ్యక్షతన జరగనున్న జిల్లా జర్నలిస్టుల స్థాయి సమావేశ నేపథ్యంలో జై యూనియన్ తరపున అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువా, పుష్పగుచ్చం తో సత్కరించడం జరింగింది. 



ఈ సందర్భంగా జై యూనియన్ సర్వసభ్యులకు తెలియజేయునది ఏమనగా...!  ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ( ఏ ఎం ఐ ఎఫ్)  ఐజెయు ఆహ్వానం మేరకు  విశాఖ జిల్లా మహాసభకు హాజరుకావాలని కోరుతున్నాం.  



ఈ మహాసభకు అతిథులుగా  హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, ఎంపీ భరత్ , పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్,  జిల్లా ప్రథమ పౌరురాలు మేయర్ గొలగాని హరి వెంకట్రమణ కుమారి, జీవీఎంసీ కమిషనర్ ఐఏఎస్ సంపత్ కుమార్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఐపీఎస్ డాక్టర్ సంక బ్రత బాగ్జి, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పళ్ళ శ్రీనివాస్, అనకాపల్లి ఎమ్మెల్యే కొలతల రామకృష్ణ, భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాస్, విశాఖ పశ్చిమ పి.గణబాబు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పలువురు నాయకులు హాజరవుతున్నారు. 

కావున  యూట్యూబ్ జర్నలిస్టుల పై కీలక నిర్ణయం, తీర్మానం చేసే అవకాశం ఉంది, అదేవిధంగా మన సోషల్ మీడియా తరఫున యూట్యూబ్ జర్నలిస్టుల సమస్యలను డిమాండ్లను వారి దృష్టికి తీసుకు వెళ్లేందుకు మన సభ్యులు హాజరయ్యే సంఖ్య బట్టి మన సమస్యల పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది కనుక  జిల్లాలో జై యూనియన్స్ సభ్యులంతా  హాజరు కావలసిందిగా కోరుతున్నాం. 

మధ్యాహ్నం:  🍛🍚విందు ఏర్పాటు చేయటం జరిగింది. 

తేదీ : 26-11-2024 మంగళవారం,

సమయం :ఉదయం 8 గంటలకు,

వేదిక : హోటల్ సింకా గ్రాండ్,

రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం.

ఇట్లు,

_అధ్యక్ష, కార్యదర్శులు_

యువి రావ్ , సంజయ్ రెడ్డి.