జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంపై స్పందించిన అనకాపల్లి ఎంపి

అనకాపల్లి జిల్లా జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంపై స్పందించిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీ.ఎం రమేష్. 

పరవాడ ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్ అయిన ఘటనపై యాజమాన్యం మీద ఆగ్రహం వ్యక్తం చేసిన అనకాపల్లి ఎం.పీ. 



గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఆదేశాలిచ్చినా కంపెనీల నిర్లక్ష్యవైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం. చికిత్స పొందుతూ కార్మికుడు మృతిచెందడంపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీ.ఎం రమేష్. విష వాయువు పీల్చి అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యంకు,వైద్యులకు ఆదేశలు జారీ. పార్లమెంట్ నుండి నేరుగా జిల్లా ఉన్నత అధికారులతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న అనంతరం ప్రమాదానికి కారణమైన వారిపై, యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై దర్యాప్తు నిర్వహిస్తాం అని తెలియజేసిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్.


బుధవారం అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువు { హైడ్రోక్లోరిక్ ఆమ్లం } లీక్ అయిన ఘటనపై అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీ.ఎం రమేష్ గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ఉన్న తరుణంలో కొంత సమయం క్రితం ఘటన గురించి తెలిసింది అని వెంటనే జిల్లా అధికారులకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.ఉమ్మడి జిల్లాలో జరిగిన ఫార్మా ఘటనలపై ఇప్పటికే అన్నీ కంపెనీ యాజమాన్యాలకు భద్రత గురించి అనేక ఆదేశాలు జారీ చేయడం జరిగింది అని అదేవిధంగా అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఫార్మా కంపెనీ ప్రతినిధులతో జిల్లా ఉన్నత అధికారులు తో పలు మార్లు భద్రతా చర్యలు గురించి సమీక్ష సమావేశాలు నిర్వహించినప్పటికీ ఇలాంటి ఘటన పునరావృతం కావడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఆదేశాలిచ్చినా కంపెనీల యాజమాన్యం నిర్లక్ష్యవైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అభిజిత్ దాస్(23) అనే కార్మికుడు చికిత్స పొందుతూ కార్మికుడు మృతిచెందడంపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విష వాయువు పీల్చి అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యంకు, వైద్యులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాము అని ఆసుపత్రి దగ్గరికి స్థానిక నాయకులు వెళ్ళి బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి పర్యవేక్షించి వివరాలు తెలియజేయాలని సూచించామని తెలిపారు. ఘటనపై ఎప్పటికప్పుడు జిల్లా ఉన్నత అధికారులతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నాను అని ఠాగూర్ ఫార్మా కంపెనీ మీద కచ్చితంగా సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. ప్రమాదానికి కారణమైన వారిపై,  యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై పూర్తి దర్యాప్తు నిర్వహించిన అనంతరం ప్రమాద కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మృతి చెందిన వ్యక్తికు మరియు అస్వస్థకు గురైన బాధితులకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందని తెలియజేశారు.