మీ ఎమ్మెల్యే మీ ఇంటికి



దమ్మపేట మండలంలో స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ  ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మీ ఎమ్మెల్యే మీ ఇంటికి కార్యక్రమం ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఐదవ విడత విడుదల చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను గండుగులపల్లి మొండివర్రె నాగుపల్లి శ్రీరామపురం నాచారం తొట్టిపంపు మొద్దులగూడెం ముష్టిబండ మందలపల్లి మారప్పగూడెం దమ్మపేట మల్కారం పెద్దగొల్లగూడెం పార్కలగండి పట్వారిగూడెం జగ్గారం లింగాలపల్లి గ్రామపంచాయతీలలో పర్యటించి 28 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు 28,03,248 /- రూపాయలు, 35 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు 12,64,000/- మొత్తంగా 40,67,248 /- రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు.



ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు మంజూరయ్యాయని వారం రోజుల్లో అన్ని మండలాల్లో పనులు ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.