శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకున్న శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు యస్.సి.వి నాయుడు
శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు యస్. సి. వి నాయుడు నేడు కార్తీక సోమవారం సందర్బంగా శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుణ్ణి దర్శించుకున్నారు.
ఈ సందర్బంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం యస్. సి. వి నాయుడు గారిని కండువాతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా యస్. సి. వి నాయుడు మాట్లాడుతూ, కార్తీక సోమవారం నాడు వాయులింగేశ్వరుడు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రజలు, భక్తులు అందరూ ఆ వాయులింగేశ్వరుణ్ణి దర్శించుకుని, ఆయన ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో యస్. సి. వి నాయుడుతో పాటు గోగినేని భాస్కర్ నాయుడు, వినయ్ లు పాల్గొన్నారు.