పవర్ చలనచిత్రం టైటిల్ ఓపెనింగ్ ఫస్ట్ లుక్ బ్రోచర్ ను విడుదల చేసిన ప్రముఖ సినీ నటులు సుమన్
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అంచనాలకు మించని సంచళనాలను సృష్టిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన పవర్ చలనచిత్రం టైటిల్ ఓపెనింగ్ ఫస్ట్ లుక్ బ్రోచర్ ను విజయవాడలోని హనుమాన్ పేటలో గల అనుమల లక్ష్మణరావు ఫంక్షన్ హాలు నందు ప్రముఖ సినీ నటులు సుమన్ చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం పవర్ చలనచిత్ర దర్శకులు, సౌత్ ఇండియన్ ఫిలిమ్ అర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షులు వెంకట రమణ పసుపులేని ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. ఈ సంధర్భంగా సినీ నటులు సుమన్ మాట్లాడుతూ పవర్ చలనచిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటనున్నట్లు తెలిపారు. పవర్ సినిమాలోని సామాజికంశాలతో పాటు సంచలన సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకోనున్నట్లు చెప్పారు. వైవిధ్య భరితంగా మానవీయ కోణంలో మూస పద్ధతులకు భిన్నంగా సాగే కథాంశంతో పవర్ సినిమాను దర్శకుడు వెంకట రమణ పసుపులేటి చక్కగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అనంతరం సినీ నటులు సుమన్ ను శారదా కళాశాల కమిటి అధ్యక్షులు డోకిపర్తి శంకరరావు, సౌత్ ఇండియన్ ఫిలిమ్ అర్టిస్టు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కొండిశెట్టి సురేష్ బాబుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరింంచారు. ఈ కార్యక్రమంలో ఫిలిమ్ అర్టిస్టు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, నటీ నటులు, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.