పుట్టలో పాలు పోసే భక్తులను లోపలికి రానివ్వకుండా ఫారెస్ట్ ఆఫీసు గేట్లకు తాళాలు....పుట్టలు లేనందువల్ల భక్తులను లోపలికి రానివ్వట్లేదని తేల్చి చెప్పిన ఎఫ్ డి ఓ సుజాత....ఆవేదనతో వెనుదిరిగిన భక్తులు...
భద్రాచలం: భద్రాద్రి జిల్లా భద్రాచలం ఫారెస్ట్ ఆఫీసు నందు గత 30 సంవత్సరాలుగా నాగుల చవితి సందర్భంగా భద్రాచల పట్టణ ప్రజలు స్థానికంగా ఉన్న ఫారెస్ట్ ఆఫీసు నందు పుట్టలో పాలు పోసేవారని, అది మాకు ఆనవాయితీగా వస్తుందని, మరి ఇప్పుడు ఆ పుట్టలు ఏమయ్యాయని వాటిని ఎందుకు తీపించారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఈ విషయమై ఎఫ్ డి ఓ సుజాత భక్తులతో మాట్లాడుతూ గతంలో పుట్టలు ఉన్న మాట నిజమే కానీ, ఇప్పుడు లోపల ఎటువంటి పుట్టలు లేవని మొత్తం ఎండిపోయిన బాంబో ఉందని, ఒకవేళ నిజంగా లోపల పాలు పోసే పుట్టలు ఉంటే భక్తులను ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా వారి మనోభావాలు దెబ్బతీయకుండా లోపలకి పంపిస్తామని, ఎండిపోయిన బాంబో వద్దకు వెళ్లడానికి వీలులేదని తెలియక అక్కడ ఏమైనా దీపాలు పెట్టడం వలన ఒకవేళ ఫైర్ అయితే భక్తులకు ప్రమాదం జరుగుతుందని తెలియజేశారు, పుట్టలు లేని కారణంగానే భక్తులను ఆపవలసి వచ్చిందని కావున భక్తులందరూ మాకు సహకరించగలరని తెలియజేశారు.