పూరిల్లు దగ్ధమైన కుటుంబాన్ని ఆదుకున్న బిఆర్ఎస్ నాయకుడు బిర్రం వెంకటేశ్వరరావు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం మొద్దులమడ గ్రామంలో రెండు రోజుల క్రితం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరీలు దగ్ధం అయ్యి నిర్వాసితులైన బాధితులు కాక వీరయ్య కుటుంబాన్ని ఆదుకున్న BRS నాయకుడు బిర్రం వెంకటేశ్వరావు. బాధితుల కుటుంబానికి నిత్యవసర సరుకులు అయిన 2 బాగ్స్ బియ్యం, వంట సామాగ్రి, బట్టలు, దుప్పట్లు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లోకం సాంబశివరావు, పండా రాజు ex mptc, కాక సత్యం, కాక మధు,జేడ్డి కోటేష్, కాక చంద్రం పాల్గొన్నారు.