ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కి కొండి శెట్టి సురేష్ వినతి

గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరించాలని ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ ని కలిసి వినతిపత్రం అందించిన జాతీయ ఆర్ఎంపి, పిఎంపి సంఘాల సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు కొండిశెట్టి సురేష్ బాబు.



ఈ సంధర్భంగా కొండిశెట్టి సురేష్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75 వేల మంది ఆర్ఎంపి, పిఎంపి వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో, మురికివాడల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో గ్రామీణ వైద్యులు ప్రజలకు చేసిన సేవలను వివరించారు. ఎందరో కరోనా రోగుల ఇళ్లకు నేరుగా వెళ్లి ధైర్యంగా చికిత్సలు అందించింది గ్రామీణ వైద్యులు ఆర్ఎంపి, పిఎంపి లేనని వివరించారు. జనవాణి కార్యక్రమంలో డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్యం వచ్చిన వెంటనే గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరిస్తానని హామి ఇచ్చారు అని అలాగే యువగళం పాదయాత్రలో గ్రామీణ వైద్యులైన మేము తమరి దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. అయితే అప్పట్లో గ్రామీణ వైద్యులు చేస్తున్న సేవలు తనకు తెలుసని, తాము అధికారంలోకి రాగానే గ్రామీణ వైద్యులుగా ప్రభుత్వ గుర్తింపు ఇస్తామని చెప్పినట్లు తెలిపారు. ప్రభుత్వం అసెంబ్లి సమావేశాల్లో గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరించాలి అని ప్రభుత్యం కుటమి తో అన్ని సమస్యలు పరీక్షిస్తుంది అని ఇది శుభ పరిణామమన్నారు. వంద రోజుల్లోనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. ఈ నేపధ్యంలో ఆర్ఎంపి, పిఎంపి వైద్యుల సమస్యలను కూడా ప్రత్యేక దృష్టితో ఆలోచించి ప్రభుత్వ పరంగా తమకు గుర్తింపునివ్వాలని కోరారు. అలాగే 108, 104, ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలిపారు. దానికి డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్,  ఆరోగ్య శాఖ మంత్రి సత్య ప్రకాష్ యాదవ్ సానుకూలంగా స్పందించినట్లు జాతీయ ఆర్ఎంపి, పి ఎం పి సంఘాల సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు కొండిశెట్టి సురేష్ బాబు తెలిపారు.  ఈ కార్యక్రమంలో జనార్ధన్ శ్రీనివాస్ పాల్గోన్నారు.