గ్రామాల్లో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

సమాజ సేవలో ముఖ్య ప్రాధాన్యమైనది మానవసేవనని,    దీంతో భగవంతుని అనుగ్రహం లభిస్తుందని వినాయకపురం గ్రామానికి చెందిన బిర్రం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని పాలగుంపు గ్రామంలో గిరిజన కుటుంబాలకు కార్తీక మాసం మరియు చలికాలం సందర్భంగా వృద్ధులకు దుప్పట్లో పంపిణీ కార్యక్రమాన్ని వినాయకపురం గ్రామస్తులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు కార్యక్రమాన్ని కొనసాగించారు. 



మండల పరిధిలోని ఉన్న ఏజెన్సీ ప్రాంతమైన పాలగుంపు గ్రామంలో సుమారు 38 కుటుంబాలకు దుప్పట్లను ఆయా గ్రామంలో ఉన్న 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు కలిగిన వృద్ధులకు దుప్పట్లను వితరణ సాగించారు. ఇటువంటి సందర్భంలో గ్రామంలోనూ వృద్ధులు చలికాలంలో పడుతున్న ఇబ్బందుల దృష్టిలో పెట్టుకొని ఇటువంటి కార్యక్రమాలను ప్రతి సంవత్సరం ప్రతి గ్రామంలోనూ కొనసాగించటం జరుగుతుందని గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తున్న సందర్భంలోనే ఈ ఏడాది కూడా వృద్ధులను దృష్టిలో పెట్టుకొని దుప్పట్లను వితరణ చేయడం జరుగుతుందని బిర్రం వెంకటేశ్వర తెలిపారు. ఈ కార్యక్రమంలో పండా రాజులు, కాకా సత్యనారాయణ, సున్నం వెంకటేశ్వరరావు, గొంది కృష్ణ, గొంది వెంకటేశ్వరరావు, కాకా మధు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు