కర్నూల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి గా మొదటిసారి కర్నూల్ కు విచ్చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు శుభాకాంక్షలు తెలిపిన మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి
గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో జరిగిన అనర్థల గురించి మరియు వలసల గురించి మంత్రి వివరంగా వివరించిన మంత్రాలయం టిడిపి ఇంచార్జ్
కర్నూల్ జిల్లా కు ఇంచార్జ్ మంత్రి గా కూటమి ప్రభుత్వం నియమించిన తర్వాత జలవనురుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మొదటిసారిగి కర్నూల్ వచ్చిన సందర్బంగా మన మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో పుష్పగుచ్చం అందచేసి స్వాగతం పలికారు.అనంతరం NDA కూటమి నాయకుల సమావేశంలో పాల్గొని రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ మంత్రాలయంలో గత కొద్ది కాలం కిందట జరిగిన గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ లో జరిగిన అనర్తల గురించి తెలియచేసారు. మంత్రాలయం నియోజకవర్గం రాష్ట్రం లో మొట్టమొదటి వలసల ప్రాంతంగా తయారైంది అని ఈ వలసలు సమస్యకు RDS కుడి కాలువ వస్తే నియోజకవర్గానికి సాగు నీరు ద్వారా వలసలు తగ్గించవచ్చు, అలాగే పులికనుమ ప్రాజెక్ట్ నుండి సాగు మరియు త్రాగు నీరు వలన మంత్రాలయాన్ని సస్యశ్యామలం చేయడానికి జలవనరుల శాఖ మంత్రిగా మరియు మా కర్నూల్ జిల్లా ఇంచార్జ్ గా ఉన్న మీరు వీలైనంత త్వరితంగా పరిస్కారం చూపాలని, టీడీపీ ఇంచార్జ్ మాట్లాడటం జరిగింది. దానికి మంత్రి మాట్లాడుతూ ఇంతకు ముందే ఆ సమస్య గురించి విన్నాను మరల వింటున్నాను అంటూ ఆ సమస్యను వీలైనంత త్వరగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్లకు తెలియ చేసి పరిష్కారం చేసే బాధ్యత తనదే అంటూ సానుకులంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో భారీ పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ ఎంపి నాగరాజు , జిల్లా అధ్యక్షులు తిక్కరెడ్డి మరియు కర్నూలు జిల్లా కూటమి ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లు, నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.