యూట్యూబ్ జర్నలిస్ట్ పిల్లల విద్యా ఫీజుల రాయితీపై స్పందించిన జాయింట్ కలెక్టర్

యూట్యూబ్ జర్నలిస్ట్ పిల్లల విద్యా ఫీజుల రాయితీపై స్పందించిన జాయింట్ కలెక్టర్  

- ప్రభుత్వంతో మాట్లాడి సానుకూల దిశగా కృషి చేస్తానని హామీ

విశాఖపట్నం, డిశంబర్ 9, 

యూట్యూబ్ జర్నలిస్ట్ పిల్లల విద్యా ఫీజుల రాయితీపై ప్రభుత్వంతో మాట్లాడి హామీ దిశగా కృషి చేస్తానని జాయింట్ కలెక్టర్ మయూర అశోక్ అన్నారు. 



యూట్యూబ్ వర్కింగ్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ పిల్లలకు విద్యలో రాయితీలు కల్పించాలని కోరుతూ జర్నలిస్ట్ అసోసి యేషన్ ఆఫ్ యూట్యూబర్స్( జై ) రాష్ట్ర, అధ్యక్షులు యూ.వి. రావు. ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి, జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు, ప్రతినిధులు విశాఖ జాయింట్ కలెక్టర్ మయూర అశోక్ కు సోమవారం ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ వినతి పత్రానికి సానుకూలంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ మయూర అశోక్ ప్రభుత్వానికి నివేదిక తెలియజేసి పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జై యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు యువి రావు, సంజయ్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రైవేటు విద్యా, వైద్య సంస్థలలో ఫీజుల చెల్లింపులలో జై- యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్న లిస్ట్ పిల్లలకు ఇప్పించాలని, ప్రైవేటు విద్యా సంస్థ లలో తమ పిల్లలను చదివించడం తమకు కష్ట సాధ్యంగా ఉందని జీతాలు లేకుండా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నామని జాయింట్ కలెక్టర్ కు వివరించారు. 



ప్రకటనల రూపంలో ఆదాయం సమకూరుతుంది కదా అని జాయింట్ కలెక్టర్ అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి స్పందిస్తూ జర్నలిస్టులకు ప్రకటనలపై ఎటువంటి ఆదాయం రావటం లేదని నిరంతరం ప్రభుత్వానికి ప్రజా సమస్యలను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధన మేరకు పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కా రానికి ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ నిస్వార్థ సేవలు అందిస్తున్నామని వివరించారు. యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులపై తప్పుడు ప్రచారం జరుగుతుందని యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు గతంలో వివిధ పత్రిక ఛానల్ లలో ఆయా యాజమాన్యాలు ఇచ్చే టార్గెట్లను భరించలేక సొంతంగా యూట్యూబ్ ఛానల్ నెలకొల్పి సమాజాభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నామని వివరించారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ ప్రజా సమస్యలేమైనా ఉంటే నేరుగా తనకి ఫోన్ చేసి చెప్పవచ్చని సమస్యలు పరిష్కా రానికి సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు భాగ స్వాములు అవుదాం అన్నారు. యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టుల సమస్యలపై ఇప్పటికే మంత్రి లోకేష్ కు, టీడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కు జై యూనియన్ వినతి పత్రం అందించిందని చెప్పగా యూట్యూబ్ జర్నలిస్టుల పిల్లల కు ప్రైవేటు విద్యాసంస్థల్లో రాయితీపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జై యూనియన్ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు రామచంద్ర, జిల్లా అధ్యక్షులు యాకూబ్ ఉపాధ్యక్షులు గౌరీ నాయుడు, రాంబాబు, అప్పలరాజు, సూర్యనారాయణ, లెక్కల సూర్యనారాయణ, సంజయ్, తదితరులు పాల్గొన్నారు.