యూట్యూబ్ న్యూస్ జర్నలిస్టులకు శుభవార్త... యూట్యూబ్ న్యూస్ జర్నలిస్ట్ లకు అక్రిడేషన్లు ఎంతైనా అవసరం...
యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి...
- రాష్ట్ర టిడిపి అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ హామీ
- రాష్ట్ర సీఎం, మంత్రి లోకేష్, ఐఎన్పీఆర్ కు సిఫార్సులు పంపిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్
విశాఖపట్నం: యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు ఎవరైతే వృత్తి పరంగా ఉపాధి పొందుతూ ప్రజాసేవ, సమాజాభివృద్ధికి కృషి చేస్తున్నారో వారందరికీ అక్రిడేషన్లు వచ్చేలా సహకరిస్తానని టిడిపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. మంగళవారం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ (జై) యూనియన్ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి సారధ్యంలో ఆయనను కలిసిన జై యూనియన్ ప్రతినిధులు మాట్లాడారు. వివిధ పత్రికల్లో ఛానల్లో పనిచేసిన అనుభవంతో యూట్యూబ్ ను వేదికగా చేసుకొని న్యూస్ ఛానల్ ను నడుపుతున్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు వివిధ రాయితీలకోసం ,అక్రిడేషన్లు ఇప్పించాలని, ఇప్పటికే మంత్రి లోకేష్ కు నేరుగా వినతిపత్రం ఇవ్వడంతో పాటు, రిజిస్టర్ పోస్టు కూడా చేసినట్లు వివరించారు. ఈమేరకు ఆయన స్పందిస్తూ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో భూమికి పోషించిన యూట్యూబ్ జర్నలిస్టులకు కూడా అక్రిడియేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, సిఫార్సు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు, టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ లేఖ రాశారు. దీంతో పాటూ ఐ.ఎన్.పి.ఆర్ కు కూడా పలు సూచనలు ఇస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఈ సిఫారసు తో పాటు పని జరగాలంటే యూనియన్ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. ఈనేపథ్యంలో ఇటీవల వైజాగ్ వచ్చిన మంత్రి నారా లోకేష్ కు ఈ విషయంపై వినతి పత్రం ఇవ్వడంతో పాటు, రిజిస్టర్ పోస్టులో, రాష్ట్ర కార్యాలయానికి లేఖను అక్కడికక్కడే పంపారు. ముఖ్యమంత్రి దగ్గరికి ఈ సిఫారసు పత్రం వెళ్లినప్పటికీ, ఐ.ఎన్.పి.ఆర్ నుండి కూడా పూర్తి పనులు చేయించుకునే బాధ్యత తీసుకోవాలని అన్నారు. హౌస్ కమిటీలో ప్రతి ఒక్కరితో నేరుగా కలిసి మీరు అనుకున్న అక్రిడేషన్, విద్యార్థుల ఫీజులో రాయితీ సిఫర్స్ పత్రాలను అన్ని విభాగం నుండి దాటుకుంటూ క్యాబినెట్ కి వెళ్లే విధంగా జై సంఘ నాయకులు కృషి చేయాలని సూచించారు.
ఒకప్పుడు మీడియారంగం ఏదో ఒకరి చేతిలో ఉండేది, కానీ నేడు అందరి చేతికి వచ్చిన ఈ నేపథ్యంలో సోషల్ మీడియా మరింత విస్తృత పరుచుకోవడంతో నేడు ప్రజలో కూడా ఆధరణ పెరగటం.. యూట్యూబ్ ద్వారానే ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా న్యూస్ ప్రసారం చేసి, ప్రజాసేవలో భాగమైన జర్నలిస్ట్ లకు కూడా సంక్షేమం అందించాలని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబ్ రాష్ట్ర, జిల్లా సంఘాల జర్నలిస్ట్ నాయకులు, జర్నలిస్టులు, విశాఖ జిల్లా అధ్యక్షులు యాకూబ్, ఉపాధ్యక్షులు గౌరీ నాయుడు, గాజువాక అధ్యక్షులు శంకర్, సెక్రటరీ సుధాకర్, రాష్ట్ర జిల్లాల కార్యవర్గ సభ్యులు రమేష్ చంద్ర, మూర్తి, సీనియర్ పాత్రికేయులు గోవింద్, రాజు, చందు తదితరులు పాల్గొన్నారు.