ఎన్నటికైనా గుంతలు పూడ్చలేని అశ్వరావుపేట రింగ్ రోడ్డు..గుంతల్లో లారీ పడి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం...గుంతల్లో ఇరుక్కుపోయిన స్కూలు బస్సు....అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలంటున్న పట్టణ ప్రజలు...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట పట్టణంలోని రింగ్ రోడ్ సెంటర్ లో గుంతలోపడ్డ లారీ వలన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
గతంలో కూడా ఈ ప్రాంతంలో రెండు వాహనాలు పడ్డాయని అయినా కూడా నేటికి ఈ గుంతల మరమ్మత్తు చెయ్యలేరని ఈ అశ్వరావుపేట పట్టణం మొత్తం కూడా రోడ్లు ఇలాగే ఉన్నాయని ఇప్పటికైనా రోడ్ల మరమ్మత్తు వెంటనే చేపట్టాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.