శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానము, బురుజుపేట, విశాఖపట్నం: మార్గశిరమాసోత్సవముల సందర్భంగా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో తేది.02-12-2024న ప్రారంభమైన మార్గశిరమాసోత్సవములు నేడు అనగా తేది. 07-12-2024న శ్రీ చక్రనవావర్నార్చన, లక్ష్మీహోమం, వేదపారాయణ, సప్తశతీ పారాయణ, మహావిద్యాపారాయణ, పూర్ణాహుతి నిర్వహించారు.
ఈ కార్యక్రమాలలో భాగంగా శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో ప్రతి శనివారం నిర్వహించు సహస్ర తులసి పూజ నేడు అనగా తేది. 07-12-2024న ఉదయం 8.00 గం..ల నుండి 9.00 గం..ల వరకు నిర్వహించారు. ఈ పూజలో ఉభయదాతలు పాల్గొన్నారు.
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో మార్గశిరమాసం ప్రతి రోజు నిర్వహించు పంచామృతాభిషేకం పూజలో బాగంగా ఈ రోజు అనగా తేది. 07-12-2024న 12 మంది ఉభయదాతలు పాల్గొనగా శ్రీ అమ్మవార్ని దేవదాయ శాఖ కమీషనరు శ్రీ ఎస్. సత్యనారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ప్రభుత్వ కార్యదర్శి, రెవెన్యూ (దేవదాయ ధర్మదాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కమీషనరు, దేవదాయ ధర్మదాయ శాఖ, ఎస్. సత్యనారాయణ సతిసమేతంగా శ్రీ అమ్మవార్ని దర్శించుకొన్నారు.
వీరిని ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ ఉపకమీషనరు & కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి కె. శోభారాణి వారు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
వీరిచే శ్రీ అమ్మవారి ప్రత్యేక పూజ అనంతరం వేద ఆశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి శేష వస్త్రములు, ప్రసాదములు అందజేయుట జరిగినది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం దేవదాయ శాఖ ఉపకమీషనరు శ్రీమతి ఎన్. సుజాత, జిల్లా ఎండోమెంట్ ఆఫీసరు శ్రీమతి టి. అన్నపూర్ణ మరియు ఆలయ కార్యనిర్వాహక ఇంజనీరు శ్రీ సిహెచ్. వి. రమణ, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ కె. తిరుమలేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంలో శ్రీయుత కమీషనరు వారికి మార్గశిరమాసోత్సవముల గురించి కార్యనిర్వహణాధికారి వారు వివరించుట జరిగినది.
అందుకు వారు సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యములు కలుగకుండా భక్తులందరికి శ్రీ అమ్మవారి దర్శనములు, ప్రసాదములు, అన్నప్రసాదం మరియు ఇతర ఏర్పాట్లు పూర్తి స్థాయిలో కల్పించే విధంగా చర్యలు గైకొనవలసినదిగా ఆదేశించుట జరిగినది.
మార్గశిరమాసోత్సవముల సందర్భముగా శ్రీ అమ్మవారిని దర్శించుకొను భక్తుల రద్దీ దృష్ట్యా తేది.02-12-2024 నుండి తేది. 30-12-2024 వరకు భక్తుల సౌకర్యార్దము ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో నేడు అనగా తేది. 07-12-2024న 1700 మంది భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ చేశారు.
శ్రీ క్రోధినామ సంవత్సర మార్గశిర మాస ఉత్సవములు తేది 02-12-2024 నుండి 30-12-2024 వరకు ఈ దేవస్థానంలో నిర్వహించు మార్గశిర ప్రత్యేక పూజలు
1) మార్గశిర పంచామృతాభిషేకం రూ:7,500/- (లక్ష్మీవారం)
2) మార్గశిర పంచామృతాభిషేకం రూ : 2,500/-(లక్ష్మీవారంల మినహా మిగిలిన రోజులు)
3) మార్గశిర క్షీరాభిషేకం: 1,116/- (ప్రతి శుక్రవారం)
భక్తులు ఆన్ లైన్ ద్వారా www.aptemples.ap.gov.in పై పూజలను జరుపుకొనుటకు ముందస్తుగా బుక్ చేసుకొనదలచిన వారు అకౌంట్ నెంబర్ 0608 100 11006691,IFSC code UBIN080608532. యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా, మెయిన్ రోడ్, విశాఖపట్నం. చెల్లింపు చేసి ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేసిన వారు మీ యొక్క ట్రాన్సేక్షన్ వివరాలు పూజ ID endow-eokanaka@gov.in ద్వారా పంపవచ్చును అని తెలిపారు.
టికెట్లు పొందవలసిన వారికి దేవాలయ కౌంటర్ల నందు కూడా టికెట్లు ఉదయం 6.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు అందుబాటులో ఉండునని తెలియజేయడమైనది. ఏ విధమైన దేవస్థానం సిబ్బంది లేదా ప్రైవేట్ వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఖాతాలకు లేదా ఫోన్ పే మొదలగు ఖాతాలకు టిక్కెట్ల కొనుగోలు విషయమై నగదును బదిలీ చేయరాదని కార్యనిర్వహణాధికారిణి కె. శోభారాణి, తెలియజేశారు.