జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ( జై ) సంఘం ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యందు జిల్లా కార్యవర్గ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం.
యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ నిర్వహిస్తున్న ఉభయ రాష్ట్రాలలో అనేకమంది విలేకరులను ఏకతాటిపై తీసుకు వెళ్తూ ప్రభుత్వ రాజకీయ అధికార ప్రజా సమస్యలను నిరంతరం వార్తలను సేకరిస్తూ ప్రసారాలు నిర్వహిస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం కొరకు అహర్నిశలు శ్రమిస్తూన్న జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ( జై ) సంఘం ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం లో ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యందు జిల్లా కార్యవర్గ కమిటీ ఇరు రాష్ట్రాల సభ్యుల ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. ఈ సందర్భంగా యువ భారత్ న్యూస్ ఛానల్ ఎండీ బండి భాను ప్రకాష్ ను అధ్యక్షులుగా, ఎస్. టి. డి. న్యూస్ ఛానెల్ సీఈఓ తుమ్మ ప్రేమ్ కుమార్ ను కార్యదర్శిగా, మరియు కీర్తి టీవీ ఎండీ కాకాని దయాకర్ ను కోశాధికారిగా నియమించి నియామక పత్రాలు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ( జై ) సంఘం రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి హెచ్. సంజయ్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర తెలంగాణ యూట్యూబ్ వర్కింగ్ జర్నలిస్టులు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.