రిజిస్టర్డ్ యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ నిర్వహిస్తున్న యాజమాన్యాలు, యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ వర్కింగ్ జర్నలిస్ట్ లకు ప్రభుత్వ ఆమోదం.
జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ (జయ్) సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ నిర్వహిస్తున్న యాజమాన్యం, ఈరోజు మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయంలో పౌర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జయ్ యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి మాట్లాడుతూ....
యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ నిర్వహిస్తున్న యాజమాన్యం, మరియు ఆయా ఛానెల్స్ లో వర్కింగ్ జర్నలిస్టులు గా ఉన్న వారందరూ గతంలో అనేక ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలలో వివిధ హోదాలలో కొనసాగినవారని, ఆ అనుభవంతో అన్ని పర్మిషన్లను పొంది యూట్యూబ్ ద్వారా న్యూస్ ఛానెల్స్ నిర్వహిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించిన వారని, జర్నలిజంలో పూర్తి అవగాహనతో స్వచ్ఛందంగా సేవలు చేస్తున్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందివ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో మంత్రి కోలుసు పార్థసారథి ముఖ్యమంత్రి కి తెలియజేస్తాను అని తెలుపగా, జయ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు విశాఖ నందు వినతి పత్రం ఇచ్చామని, తన కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వారికి, మీకు అధికారిక నివేదిక ఇచ్చారని, తెలిపారు. తక్షణమే స్పందించిన మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పౌర సమాచార శాఖలకు ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కార్యవర్గ కమిటీ సభ్యులు, యూట్యూబ్ న్యూస్ చానల్స్ నిర్వాహకులు పాల్గొన్నారు.