ఢిల్లీలో సేవా అవార్డుకి ఎంపికైన సినీ హీరో కంచర్ల ఉపేంద్రబాబు

వివిధ రంగాల్లో సేవలు అందించిన వారిని గౌరవిస్తూ.. ఘనంగా సత్కరించి, సన్మానించడంతోపాటు అవార్డులు ఇచ్చే సమైఖ్య తెలుగు ఎంప్లాయిస్ అసోసియేషన్ సేవా అవార్డులకు ప్రముఖ సినీ హీరో కంచర్ల ఉపేంద్రబాబు ఎంపికయ్యారు. 



దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం నిర్వహించే మెగా ఈవెంట్ లో ఈ అవార్డును ఉపేంద్రబాబు అందుకోనున్నారు. ఈ మేరకు సమైఖ్య తెలుగు ఎంప్లాయిస్ అసోసియేషన్(సేవా) వర్తమానం పంపడంతో హీరో ఉపేంద్రబాబు ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. సినిమాల్లో నటించడంతోపాటు, తన తండ్రి సినిమా నిర్మాత, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్, టిడిపి నాయకులు, ఏపీ ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రముఖ సంఘసేవకులు డా.కంచర్లచ అచ్యుతారవు అడుగు జాడల్లో నడుస్తూ.. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు ఉపేంద్రబాబు. వాటిని గుర్తించిన ఢిల్లీలోని సమైఖ్య తెలుగు ఎంప్లాయిస్ అసోసియేషన్ హీరో ఉపేంద్రబాబుని సేవా అవార్డుకి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా డా. కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, హీరో ఉపేంద్రబాబు ఢిల్లీలోని సమైఖ్య తెలుగు ఎంప్లాయిస్ అసోసియేషన్ సేవా అవార్డుకి ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. అదే సమయంలో ఈ అవార్డు హీరో బాధ్యతను మరింతగా పెంచుంతుందని అభిప్రాయ పడ్డారు. ఉపకార్ ట్రస్టు ద్వారా అందించే సేవా కార్యక్రమాలు జీవ నదిలా నిత్యం కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. ఉపేంద్రబాబు ఢిల్లీలోని సేవా అవార్డుకి ఎంపిక పట్ల అభిమానులు, ఉపకార్ ట్రస్ట్ ప్రతినిధులు, నాగు, సుధీర్, అరుణ తోపాటు మిగిలిన ఉద్యోగులు, విశాఖలోని పలువురు హర్షం వ్యక్తం చేశారు. తమ అభిమాన హీరో సినిమాల్లో నటించడంతోపాటు, సేవా కార్యక్రమాల్లో అందరికీ ఆదర్శంగా నిలవడం అభినందనీయమని కొనియాడుతున్నారు. తమ హీరోను ఆదర్శంగా తీసుకొని తాము కూడా అన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని ప్రకటించారు.