పదవుల్లో కొందరి నాయకులకు భారీ మొత్తంలో లంచాలు

రాజోలులో పదవులు రావాలన్నా...పనులు జరగాలన్న... కాసులు రాలాల్సిందే....

నీటి సంఘం పదవుల్లో కొందరి నాయకులకు భారీ మొత్తంలో లంచాలు.....

రోడ్ల నిర్మాణం జరగకముందే కమిషన్ల కక్కుర్తి....

రాజోలులో చక్రం తిప్పుతున్న ఇద్దరు కాపు చోటా నాయకులు....



పార్టీలను కంటికి రెప్పలా కాపాడుకునేది కార్యకర్తలు. కార్యకర్త లేకపోతే ఏ పార్టీకి మనుగడ ఉండదు. అధికారం లేనంత కాలం కార్యకర్త పార్టీని కాపాడుకుంటారు. అధికారం వచ్చిన తర్వాత కార్యకర్త అధికార నాయకులకు కనపడడు. అధికారం లేనప్పుడు మూల మూల దాకున్నా దొంగ నాయకులంతా అధికారం రాగానే ఎమ్మెల్యేల చుట్టూ చేరిపోతారు. అక్కడినుంచి వ్యవహారం అంతా వీళ్ళే చక్కబెట్టుతారు. రాజోలు అసెంబ్లీ నియోజవర్గంలో ఇదే తంతు రాజమేలుతోంది. జెండా మోసి పార్టీని గెలిపించుకున్న కార్యకర్తలు ఇప్పుడు కానీవాళ్ళయ్యారు. సొంత పనులు మానుకుని, వ్యాపారాలు వదులుకొని పార్టీని నిలబెట్టికొచ్చి, గెలిపించిన నాయకులు ఈ సమయంలో గుర్తుకురారు. కనీసం 10 ఓట్లు కూడా వేయించని వాళ్లు ఇప్పుడు పెత్తనం చలాయిస్తున్నారు. ఎవరికి ఏ పని కావాలన్నా, ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా రాజోలు నియోజకవర్గంలో ఆ ఇద్దరి చోటా నాయకులను కలిసి ముడుపులు చెల్లించుకోవాల్సిందే. వీరిలో ఒకరు మాజీ ఎమ్మెల్యే గొల్లపెల్లి సూర్యరావు హయాంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నవారు. వెయ్యని రోడ్లు వేసినట్టుగాను, చేయని పనులు చేసినట్టుగాను బిల్లులు పొంది పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు. ఇటీవల కాలంలో ఇతని అవినీతిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. మళ్లీ అదే తనదైన శైలిలో అవినీతికి తెర తీశారు. ఇదంతా స్థానిక ఎమ్మెల్యేకు తెలిసే జరుగుతుందనే వార్త విడిపిస్తుంది. ఇలాంటి వారు వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కష్టపడి పనిచేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్న కార్యకర్తలను గాలికి వదిలేసి, గత ప్రభుత్వంతో అంటగాగిన నాయకులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే వార్త కూడా ఎక్కువగా అనిపిస్తుంది. ఇది ప్రజల ప్రభుత్వం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని ప్రజలు మనకు ఇచ్చిన అవకాశం, మనం ప్రజలకు సేవకులు మాత్రమే అని చెప్తున్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు వ్యతిరేకంగా రాజోలు నియోజకవర్గం లో అవినీతి రాజ్యమేలుతుందని రాజోలు ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరూ ఓట్లు వేస్తేనే అధికారం వచ్చిందన్న విషయాన్ని మర్చిపోయి ఆ ఇద్దరి నేతలకు మాత్రమే పెత్తనం ఇవ్వడం, వారు అవినీతికి తెర తీయడం ఇప్పుడు రాజోలు అసెంబ్లీ నియోజవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.