రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని వాహనదారులకు అవగాహణ కోసం భారీ ర్యాలీ... కోలాహలంగా శ్రీకాళహస్తి పట్టణంలో రోడ్డు భద్రతా నియమాలతో భారీ ర్యాలీ.
రోడ్డు ప్రమాదాల రహిత సమాజ నిర్మితం కోసం పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
శ్రీకాళహస్తి పట్టణం నందు ఈ రోజు ఉదయం 10.00 గంటలకు ది స్కూల్ ఆవరణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా నియమాలు పాటించడంపై సభ నిర్వహించడం జరిగింది. వాహనచోధకులు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే అత్యంత కీలకమైన పాత్ర ప్రజలుపై ఉందని, వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వారికి అవగాహన సభను పోలీసు అధికారులు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యాతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ శ్రీ కోలా ఆనంద్ గారు సభలో పాల్గొని, పోలీసు అధికారులు నిర్వహించిన రోడ్డు భద్రతా చర్యలను గురించి కోలా ఆనంద్ కొనియాడారు.
పోలీసు శాఖ సిబ్బందికీ హెల్మెట్స్ లను స్థానిక డీఎస్పీ శ్రీ కె.ఎన్. మూర్తి, శ్రీ కోలా ఆనంద్, స్థానిక సి ఐ లు నాయక్, తిమ్మయ్య, గోపి, వెంకటేశ్వర్లు కలసి వారి సిబ్బందికి హెల్మెట్లుతో శిరస్సుధారణ చేశారు. తదుపరి డీఎస్పీ, కోలా ఆనంద్, సి ఐ లు కలసి శాంతికి చిహ్నంగా పావురాలు మరియు బెలూన్లు గాలి వదిలారు. అనంతరం పోలీసు శాఖ, పుర ప్రజలు, బీజేపీ నేతలు మరియు శ్రీకాళహస్తి పట్టణంలోని సుమారుగా 600 మంది విద్యార్థిని, విద్యార్థులు భారీ సంఖ్యతో "ది స్కూల్ నుంచి భారీ ర్యాలీగా" బయలుదేరి, వియంసి సర్కిల్, జయరాం రావు వీధి, బజార్ వీధి, తేరు వీధి, నెహ్రూ రోడ్డు, సినిమా వీధి, పాత మద్రాసు బస్టాండు గుండా ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం ఆవరణంలో విద్యార్థులను రౌండ్ ఏర్పాటు చేసి కోలా ఆనంద్ గారు మరియు డీఎస్పీ రోడ్డు ప్రమాదాలను నివారించే అంశాలు గురించి ప్రసంగించారు. తదుపరి కోలా ఆనంద్ విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సంధర్భంగా పుర వీధుల్లో ఊరేగుతూ నినాదాలు చేస్తూ ఉంటే జనాలు హర్షం వ్యక్తం చేసారు.
ఈ కార్యక్రమంలో స్థానిక డీఎస్పీ శ్రీ కె. నరసింహా మూర్తి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి, శ్రీకాళహస్తి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ శ్రీకోలా ఆనంద్, సి ఐ లు ఎం. తిమ్మయ్య, ఎం. రవి నాయక్, డి . గోపి, సి. వెంకటేశ్వర్లు, ఎస్ ఐ లు సుధాకర్ రెడ్డి, విశ్వనాథం నాయుడు, కానిస్టేబులు మరియు బీజేపీ నేతలు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, గరికపాటి రమేష్ బాబు, ఎస్వీ రమణ, సజ్జలు హరీష్, ఆర్. హరీష్ రెడ్డి, భరత్ కుమార్ నాయుడు, ఙ్ఞానగారి పోలయ్య, బైక్ షో రూమ్ బజాజ్ మురళీ కృష్ణ రెడ్డి, సుజికి రవి, టీవీస్ రమణయ్య, యమహా షో రూమ్ సుధాకర్, కటికం చెందు రాయల్, కొండమిట్ట రవి రాయల్, నానీ, సిద్ధూ, బిందు కుమార్, శింగమాల కుమార్, కోలా మురళీ, పవన్ మారి, గురజాల హరీష్, ఇత్తడి మహేష్, చిన్న, ఇత్తడి కిరణ్, వెంకీ, తులసి, ధనుష్ తదితరులు పాల్గొన్నారు.