మార్గశిరమాసోత్సవముల సందర్భంగా శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో తేది.02-12-2024న ప్రారంభమైన మార్గశిరమాసోత్సవములు సందర్భంగా నేడు అనగా తేది. 10-12-2024న శ్రీ చక్రనవావర్నార్చన, లక్ష్మీహోమం, వేదపారాయణ, సప్తశతీ పారాయణ, మహావిద్యాపారాయణ, పూర్ణాహుతి నిర్వహించుట జరిగినది.
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారికి మార్గశిర పంచామృతాభిషేకం:-
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో మార్గశిరమాసం ప్రతి రోజు నిర్వహించు పంచామృతాభిషేకం పూజలో బాగంగా ఈ రోజు అనగా మంగళవారం తేది.10-12-2024న 9 మంది ఉభయదాతలు పాల్గొన్నారు.
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారికి స్వర్ణ పుష్పములతో-అష్టదళ పద్మారాధన ప్రత్యేక పూజ
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో ప్రతి మంగళవారం నిర్వహించు స్వర్ణ పుష్పార్చన (అష్టదళ పద్మారాధన) 108 స్వర్ణపుష్పాలతో ప్రత్యేక పూజ నేటి ఉదయం. 7.00 గం..ల నుండి 8.00 గం..ల వరకు నిర్వహించుట జరిగినది. ఈ పూజలో 17 మంది ఉభయదాతలు పాల్గొన్నారు.
భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ సౌకర్యం:-
మార్గశిరమాసోత్సవముల సందర్భముగా శ్రీ అమ్మవారిని దర్శించుకొను భక్తుల రద్దీ దృష్ట్యా తేది.02-12-2024 నుండి తేది.30-12-2024 వరకు భక్తుల సౌకర్యార్ధము ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో నేడు అనగా తేది. 10-12-2024న 1700 మంది భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ చేయుట జరిగినది.
అభివృద్ధి పనులకు విరాళం:-
విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ కె. రవి శంఖర్ వారి కుమార్తె కె, సంచిత పేరున రూ. 1,00,000/- దేవాలయ అభివృద్ధి పనుల నిమిత్తం విరాళంగా సమర్పించియున్నారు. వీరికి శ్రీ అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించి శ్రీ అమ్మవారి ప్రసాదం అందజేయుట జరిగినది.
భక్తులకు విజ్ఞప్తి:-
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు మార్గశిరమాసోత్సవములు రెండవ లక్ష్మీవారం భక్తుల రద్దీ అధికముగా ఉండు దృష్ట్యా గర్భిణీ స్త్రీలు, వయోవృద్దులు, దివ్యాంగులు వీరి భద్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా లక్ష్మీవారం మినహా మిగత రోజులలో శ్రీ అమ్మవారి దర్శనము చేసుకోనవలసినదిగా కోరడమైనది, భక్తులు గమనించి సహకరించ మనవి.
శ్రీ అమ్మవారి దర్శనమునకు విచ్చేయు భక్తులకు ప్రసాదం తయారీ:-
మార్గశిర మాస రెండవ లక్ష్మీవారం సందర్భంగా శ్రీ అమ్మవారి దర్శనమునకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయు అవకాశం ఉన్నందున, విక్రయించు శ్రీ అమ్మవారి ప్రసాదములు ప్రతి భక్తునికి అందే విధముగా చర్యలు తీసుకొనబడుచున్నవి. ఇందులో బాగంగా కార్యనిర్వహణాధికారి వారు నేటి ఉదయం ప్రసాదంల విభాగంవారితో చర్చించి భక్తుల తాకిడిని బట్టి పులిహోర ప్రసాదం అరవై నుండి అరవై ఐదు వేల ప్యాకెట్లు, చక్కెరపొంగలి ఇరవై వేల ప్యాకెట్లు తయారు చేయుటకు మరియు లడ్డు ప్రసాదం 35000 (80 గ్రాముల) లడ్డూలు అందుబాటులో ఉండునట్లు తగు చర్యలు గైకోనవలసినదిగా అదేశించియున్నారు.
మార్గశిర మాస ఉత్సవములు పూజ టిక్కెట్ల బుకింగ్:-
శ్రీ క్రోధినామ సంవత్సర మార్గశిర మాస ఉత్సవములు తేది 02-12-2024 నుండి 30-12-2024 వరకు ఈ దేవస్థానంలో నిర్వహించు మార్గశిర ప్రత్యేక పూజలు
1) మార్గశిర పంచామృతాభిషేకం రూ :7,500/- (లక్ష్మీవారం)
2) మార్గశిర పంచామృతాభిషేకం రూ :2,500/-(లక్ష్మీవారంల మినహా మిగిలిన రోజులు)
3) మార్గశిర క్షీరాభిషేకం :1,116/-(ప్రతి శుక్రవారం)
పై పూజలను ముందస్తుగా బుక్ చేసుకొనదలచిన భక్తులు ఆన్ లైన్ ద్వారా www.aptemples.ap.gov. in నందు బుక్ చేసుకొనగలరు (లేదా)
యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా, మెయిన్ రోడ్, విశాఖపట్నం.
అకౌంట్ నెంబర్ : 0608 100 11006691
IFSC code UBIN080608లో చెల్లించ వచ్చును.
ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేసిన వారు మీ యొక్క ట్రాన్సేక్షన్ వివరాలు పూజ జరిపించవలసిన వారి పేరు గోత్ర నామాలు పూర్తి చిరునామా ID endow-eokanaka@gov.in ద్వారా పంపవచ్చును.
టికెట్లు పొందవలసిన వారికి దేవాలయ కౌంటర్ల నందు కూడా టికెట్లు ఉదయం 6.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు అందుబాటులో ఉండునని తెలియజేయడమైనది. ఏ విధమైన దేవస్ధానం సిబ్బంది లేదా ప్రైవేట్ వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఖాతాలకు లేదా ఫోన్ పే మొదలగు ఖాతాలకు టిక్కెట్ల కొనుగోలు విషయమై నగదును బదిలీ చేయరాదని తెలియజేయడమైనది.