ఘనంగా సెమీ క్రిస్మస్ సెలెబ్రేషన్స్

 రాజోలి లో సెమీ క్రిస్మస్ సెలెబ్రేషన్స్ 



క్రిస్మస్ పర్వదినం సందర్బంగా యేసు క్రిస్తు జన్మదినం ను  పురష్కరించుకొని  రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ (ఐ ఎన్ టి యు సి )జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రెసిడెంట్, శ్రమ శక్తి అవార్డు గ్రహీత ఆర్. పి. జయప్రకాశ్ సారద్యం లో సెమీ క్రిస్మస్ సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. 



ముందుగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుబాబు కాండిల్స్ వెలిగించారు. క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. యేసుక్రీస్తు చూపిన దయ, జాలి, ప్రేమ, లను మనం కూడా ఇతరుల పట్ల చూపాలని ఆయన అన్నారు. వైద్య వృత్తిపరంగా మనం రోగుల కు సేవలు చేయాలని మానవత్వం చాటాలని ఆయన సిబ్బంది ని కోరారు. 



హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రి మెర్రి క్రిస్మస్ అంటూ నినాదాలు చేస్తూ తమ సంతోషం ను పంచుకున్నారు. అందరికీ క్రిస్మస్ కేక్ ను, ఫలాహారం ను పంచిపెట్టారు, ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు రంజిత్ కుమార్, హెలెన్, రామకృష్ణ, ఏ ఎన్ ఎమ్ లు, ఆశా లు, వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు