విశాఖపట్నం: శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానము బురుజుపేట: మార్గశిరమాసోత్సవముల సందర్భంగా శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో తేది. 02-12-2024 న ప్రారంభమైన మార్గశిరమాసోత్సవములు నేడు అనగా తేది. 06-12-2024 న శ్రీ చక్రనవావర్నార్చన, లక్ష్మీహోమం, వేదపారాయణ, సప్తశతీ పారాయణ, మహావిద్యాపారాయణ, పూర్ణాహుతి నిర్వహించుట జరిగినది.
ఈ కార్యక్రమం లో భాగంగా శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవార్కి శ్రీరాభిషేకం, పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు.
శ్రీ అమ్మవారి దేవస్థానంలో ప్రతి శుక్రవారం నిర్వహింపబడు శ్రీరాభిషేక సేవ తేది: 06-12-2024 శుక్రవారం ఉదయం. 8.00 గం..ల నుండి 9.00 గం..ల వరకు నిర్వహించుట జరిగినది. ఈ పూజలో ఉభయదాతలు పాల్గొన్నారు. ఈ పూజ ప్రతీ శుక్రవారం నిర్వహించబడును. రూ. 1,116/-లు రుసుము చెల్లించి టిక్కెట్టు పొందిన యెడల దంపతులు పాల్గొనవచ్చును అని దేవాలయ శాఖ వెల్లడించింది.
గాజువాక శాసన సభ్యులు మరియు రాష్ట్ర అధ్యక్షులు. శ్రీ పల్లా శ్రీనివాస్ కుటుంబసమేతంగా శ్రీ అమ్మవార్ని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ప్రసాదం అందజేయుట జరిగినది.
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారికి మార్గశిర పంచామృతాభిషేకం:-
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో మార్గశిరమాసం ప్రతి రోజు నిర్వహించు పంచామృతాభిషేకం పూజలో బాగంగా ఈ రోజు అనగా తేది.06-12-2024న 15 మంది ఉభయదాతలు పాల్గోన్నారు.
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారికి సహస్ర తులసి పూజ:- శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో ప్రతి శనివారం నిర్వహించు సహస్ర తులసి పూజ రేపు అనగా తేది. 07-12-2024న ఉదయం 8.00 గం..ల నుండి 9.00 గం..ల వరకు నిర్వహించబడును. కావున ఆసక్తి గల భక్తులకు రేపు సదవకాశం