జర్నలిస్టులు అంటే రాజకీయ నాయకులకు అంత చులకనా....? రాజకీయ నాయకులు తమ ప్రచారానికి ఉపయోగించుకొని జర్నలిస్టుల ను అవమానపరుస్తున్న తీరు బాధాకరం...
తమ ప్రచారానికి జర్నలిస్టులు కావాలి...
సంవత్సరం అంతా జర్నలిస్టులు రాజకీయ నాయకుల కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, వారి రాజకీయ సభలు, వారి ప్రెస్ మీట్ లు వీటన్నింటినీ జర్నలిస్టులు కావాలి వారిని ఆహ్వానిస్తారు. తమ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తారు. కానీ డిసెంబర్ నెలలో యాడ్స్ కోసం అడిగితే, నాయకులు జర్నలిస్టుల్ని... అవమాన పరుస్తున్నారు.
నిర్లక్ష్యపు ధోరణి....
రాజకీయ నాయకులు పత్రికా స్వేచ్ఛను ఉపయోగించుకోవడంలో మాత్రం ముందుంటారు. కానీ విలేకరుల నిస్వార్థ కృషికి గౌరవం ఇవ్వడం లేదు సంస్థల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహకరించడం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చూపిస్తున్నారు.
యాడ్స్ కోసం విలేకరుల ఆరాటం...
ప్రతి విలేకరి డిసెంబర్ రాగానే యాడ్స్ కోసం తన ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి నాయకుల కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే హేళన చేస్తున్నారు సంస్థలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో నడుస్తున్న జర్నలిస్టులపై ఈ విధమైన వ్యవహారం సరైనదేనా...?
కొంతమంది మీడియా మిత్రులు భజన బ్యాచ్ గా మారి మన స్దాయి ని దిగజర్చుతున్నారు మనలో ఐక్యత లేకపోవడమే ఈ అవమానాలకు కారణం...ఇప్పటికే పలు యూనియన్లు.. రాజకీయ ప్రభుత్వ అధికార్లు.. న్యాయ శాఖలు మొట్టికాయలు వేస్తున్నాయి... ఇకనైనా భజన్ బ్యాచ్ జర్నలిజం విలువ పెంచేలా ముందడుగు వేయండి...
నాయకులు కూడా తీరును మార్చుకోవాలి......
పొగడ్తను స్వీకరించినట్టే విమర్శను కూడా స్వీకరించి సరి చేసుకోవాలి ప్రజలకు ప్రభుత్వానికి వారధి మీడియా అని గుర్తించాలి జర్నలిస్టుల పై కక్ష సాధింపు చేయాలని చూస్తే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం గత నాయకులే దీనికి ఉదాహరణ..
""మీడియా లేకపోతే, మీరు చెప్పే ప్రతి మాటే ప్రజలకు చేరవేసేది ఎలా"?
ప్రజా అభిప్రాయం గౌరవించడం పాలకులుగా మీ బాద్యత ప్రజా అభిప్రాయం సేకరించి మీ ముందు ఉంచటం మీడియా బాద్యత ఆచరించడం ఆచరించక పోవడం మీ విజ్ఞత అంటున్న పలు జర్నలిస్టుల సంఘాలు... జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి...