శ్రీ మార్గశిరమాసోత్సవముల సందర్భంగా శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో పూర్ణాహుతి

 శ్రీ మార్గశిరమాసోత్సవముల సందర్భంగా శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో తేది. 02-12-2024న ప్రారంభమైన మార్గశిరమాసోత్సవములు సందర్భంగా నేడు అనగా తేది. 11-12-2024న శ్రీ చక్రనవావరణ ర్చన లక్ష్మీహోమం, వేదపారాయణ, సప్తశతీ పారాయణ, మహావిద్యాపారాయణ, పూర్ణాహుతి నిర్వహించుట జరిగినది.



శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారికి మార్గశిర పంచామృతాభిషేకం:-

శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో మార్గశిరమాసం ప్రతి రోజు నిర్వహించు పంచామృతాభిషేకం పూజలో బాగంగా ఈ రోజు అనగా మంగళవారం తేది. 11-12-2024న 10 మంది ఉభయదాతలు పాల్గొన్నారు.

భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ సౌకర్యం:-

మార్గశిరమాసోత్సవముల సందర్భముగా శ్రీ అమ్మవారిని దర్శించుకొను భక్తుల రద్దీ దృష్ట్యా 32.02-12-2024 2 2.30-12-2024 20 వితరణ కార్యక్రమంలో నేడు అనగా తేది. 11-12-2024న 1700 మంది భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ చేయుట జరిగినది.


ఉచిత బస్సు సౌకర్యం:-

మార్గశిరమాసం తేది.12-12-2024న రెండవ లక్ష్మీవారము సందర్భంగా శ్రీ అమ్మవారి దర్శనంనకు విచ్చేయు భక్తుల సౌకర్యార్ధం 1) ఒక బస్సు సింహాచలం. గోపాలపట్నం. కంచరపాలెం మీదగా జ్ఞానపురం శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంనకు మరియు 2) ఒక టన్సు ఆర్.టి.సి. కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ మరియు పెందుర్తి నుండి బస్సు సర్వీసును శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంనకు నిరంతరం తిరిగే విదంగా రెండు ఉచిత బస్సులు ఏర్పాటు చేయుట జరిగినది.