ఛలో విజయవాడ హైందవ శంఖారావం

ఛలో విజయవాడ హైందవ శంఖారావం బహిరంగ సభను విజయవంతం చేయండి...హైందవ శంఖారావం బహిరంగ సభకు భారీగా తరలిన శ్రీకాళహస్తి బీజేపీ నేతలు....మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, అసెంబ్లీ కో - కన్వీనర్...



భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ శ్రీ కోలా ఆనంద్ గారు నేతృత్వంలో శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున బిజెపి నేతలు, కార్యకర్తలు, అభిమానులు సుమారుగా 200 మంది పైగా శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రైవేటు బస్సులు, కార్లు, రైలు మార్గంలో విజయవాడ, గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉన్న కేసరపల్లిలోని లైలా గ్రీన్ మెడోస్ నందు "హైందవ శంఖారావం బహిరంగ సభకు" భారీగా తరలినాను. 



ఈ సందర్భంగా కోలా ఆనంద్ చరవాణిలో మాట్లాడుతూ రేపు మధ్యాహ్నం 12 గంటలకు జరుగు హైందవ శంఖారావం బహిరంగ సభకు లక్షలాది సంఖ్యలో హిందువులు పాల్గొంటారన్నారు. హిందువుల  మనోభావాలు దెబ్బతినేలా గత వైసీపీ పార్టీ పాలకులు దేవాలయాల విద్వాంసులు, ఎండోమెంట్ ఆస్తుల అన్యాక్రాంతం మొదలైన అంశాలు మీద బహిరంగం సభలో వక్తలు మాట్లాడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కో -  కన్వీనర్ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి గోపాల్, సీనియర్ నేతలు కునాటి నాగరాజు, ఇమ్మిడిశెట్టి మోహన్, శ్రీపురం సుధాకర్, వి. ఈశ్వరయ్య, వేలూరు శేఖర్, మండల అధ్యక్షులు వేడం కృష్ణయ్య, పెద్దాపాలెం రవి అచ్చారీ ఆర్. హరీష్ రెడ్డి, బాగిర్తీ వెంకటేష్, ఆముదల మునిరాజా, చంద్రయ్య, సజ్జా హరీష్, కాశీ రాజనాల, కోట వెంకటేష్, సిద్ధూ, నాని, గిరిధర్ సాయి, ఎన్ గోపి, వంశీ, బాలు తదితరులు పాల్గొన్నారు.