కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో పొదుపు మహిళల సమావేశం నిర్వహించి వి.ఏ.ఓ లను నియమించాలి అని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు.
పత్తికొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు పొదుపు మహిళలతో నిరసన ధర్నా చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని పొదుపు గ్రూపుల్లో అవినీతి అక్రమాలకు పాల్పడిన A.P.M, C.C, లను సస్పెండ్ చేసి, గ్రామైక్య సంఘాల మీటింగ్ ను ఏర్పాటు చేసి మహిళల అభిప్రాయాలని సేకరించి వారి అభిప్రాయాన్ని తీర్మానం చేసి వి.ఏ.ఓ లను నియమించాలని, స్థానికంగా కొన్ని సంవత్సరాల నుంచి పొదుపు చేసుకుంటూ పొదుపు గ్రూపుల్లో ఉన్నటువంటి స్థానిక మహిళలను మాత్రమే వి.ఏ.ఓ లుగా నియమించాలని డిమాండ్ చేశారు. జిల్లా మెప్మా అధికారులు పొదుపు మహిళలతో సమగ్ర విచారణ జరిపించి నియమ నిబంధనల ప్రకారం విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ లుగా పొదుపు మహిళలను మాత్రమే నియమించాలనే నిబంధనలను తుంగలో తొక్కి అధికారులను తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.లేని పక్షంలో మహిళా ఐక్య వేదిక మహిళల ఆత్మగౌరవ హక్కుల పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళా ఐక్య వేదిక జిల్లా అధ్యక్షురాలు పాలెం రాధా పొదుపు గ్రామైక్య సంఘాల లీడర్లు లలితా బాయి, కె.డి. లలిత, వరలక్ష్మి , మరియు పొదుపు మహిళలు వరలక్ష్మి, రేష్మ, రంగమ్మ, సుకన్య, ఆదిలక్ష్మి, ముంతాజ్ , ఉరుకుందమ్మ తదితరులు పాల్గొన్నారు.