గ్రామీణ వైద్యులు తర తరాలుగా ప్రథమ చికిత్స చేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతూ నిత్య ప్రజా సేవకులు వలే కష్టపడి ఎన్నో ఇబ్బందులకు గురి అవుతూ ప్రథమ చికిత్స చేస్తూ ప్రజలకు ప్రాణాలు కాపాడుతున్న మాట వాస్తవం.
గ్రామీణ వైద్యులు కూటమి ప్రభుత్వం ఏర్పడుటకు క్రియాశీలకంగా పల్లె నుండి పట్టణం వరకు ఆర్ ఏం పి లు మద్దతు తెలపడం, గ్రామీణ వైద్యుల సహకారాలు అందించడం జరిగింది. గ్రామీణ వైద్యులు సంక్షేమం కొరకు ఆగిన ట్రైనింగ్ క్లాసులు మరల పున ప్రారంభించి, వృత్తి భద్రత కొరకు ప్రభుత్వంచే గుర్తింపబడి ప్రధమ చికిత్స చేయుటకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అనుమతులు అందించాలని అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం బడ్జెట్లో గ్రామీణ వైద్యుల కొరకు 100 కోట్లు కేటాయించాలి, వారి సంక్షేమం కొరకు వారి వృత్తి భద్రత కొరకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని తమ సమస్యలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్చించి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామీణ వైద్య సంఘాలు తదితర అనుబంధ సంఘాలు మొత్తం కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడానికి గ్రామీణ వైద్యులు సహాయ సహకారాలు ఎంతగానో అందించినారు. ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి, గుర్తించి సహాయ సహకారాలు అందించాలని గ్రామీణ వైద్యులు ఎదురుచూస్తున్నారని జాతీయ ఆర్ఎంపీ పీ ఎంపీ సంఘాల సమైక్య అధ్యక్షులు కొండి శెట్టి సురేష్ బాబు విజయవాడ ఒక ప్రకటనలలో తెలిపారు.