లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు రాజీ చేయండి.....

లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు రాజీ చేయండి.....జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జూనైద్ అహ్మద్ మౌలానా.....

 


శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రానున్న లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు రాజి చేయమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జూనైద్ అహ్మద్ మౌలానా అన్నారు.



గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవఅధికారి సంస్థ వారు స్థానిక జిల్లా కోర్టు భవనం నందు జిల్లా లో గల న్యాయమూర్తులు అందరితో ఆన్లైన్లో సమావేశం ఏర్పాటు చేశారు. మార్చ్ 08 వ తేదీ జరుగనున్న లోక్ ఆధాలాత్ లో ఎక్కువ కేసులు రాజి చేయమని కోరారు. ఈ కార్యక్రమంలో ఒకటవ అదనపు జిల్లా జడ్జి పి భాస్కర రావు, 3 వ అదనపు జిల్లా జడ్జి వివేక్ ఆనంద్ శ్రీనివాస్, 4 వ అదనపు జిల్లా జడ్జి ఎస్ ఎం ఫణి కుమార్, జిల్లా కార్యదర్శి న్యాయ సేవాధికార సంస్థ ఆర్. సన్యాసి నాయుడు, గేదెల వాసుదేవరావు, ఎం అన్నం నాయుడు, శ్రీకాకుళం పట్టణ బార్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కె. ఈశ్వరరావు, వై.  ప్రసన్నకుమార్ ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.