జయ్ యూనియన్ జర్నలిస్టులకు సర్టిఫికెట్ల పంపిణీ చేసిన మంత్రి ఎన్.ఏం.డి. ఫరూఖ్

జయ్ యూనియన్ జర్నలిస్టులకు (సభ్యులకు) సర్టిఫికెట్ల పంపిణీ చేసిన మంత్రి ఎన్.ఏం.డి.  ఫరూఖ్



చంద్రబాబుతో త్వరలో భేటీ కానున్న జయ్ యూనియన్



జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జయ్ యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్. సంజయ్ రెడ్డి, మరియు ప్రకాశం జిల్ల దర్శి పట్టణ సాదిక్ సాఫ్ట్ స్కిల్స్ నేతృత్వంలో మైనారిటి హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 



రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న జయ్ యూనియన్ యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు 4 నెలల కాల వ్యవధిలో ఇంటర్మీడియట్ అర్హతతో సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ జర్నలిజం మరియు డిగ్రీ అర్హతతో  ఒక సంవత్సర కాలం పరిమితి తో డిప్లొమా ఇన్ జర్నలిజం కోర్సు పై శిక్షణ తరగతులు నిర్వహించి, 



ఉత్తర్ణత పొందిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జయ్ యూట్యూబ్ న్యూస్ ఛానెల్ జర్నలిస్టులకు ఈరోజు విజయవాడ తాడేపల్లి నందు, ఎన్.ఏండి. ఫరూఖ్ శాసన, న్యాయ పాలన, మరియు అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మంత్రి చే, తన స్వగృహం వద్ద సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం జయ్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం  ఘనంగా నిర్వహించారు.



ఈ కార్యక్రమం నందు ముఖ్య అతిధులుగా విచ్చేసిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లి  మాట్లాడి అందరినీ కొనియాడారు. 



ఈ సందర్భంగా జయ్ యూనియన్ రాష్ట్ర వ్యవపస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి మాట్లాడుతూ జయ్ యూనియన్ యొక్క నిర్మాణ ఆవశ్యకత, విధివిధానాలు, యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి వివరించి తెలుపుతూ నారా లోకేష్ ప్రజగలం లో మా యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ వారిని ప్రభుత్వ గుర్తింపు, సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చినారని, 



ఇప్పటికే అనేక మార్లు మంత్రి నారా లోకేష్ కు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ కు, ఐ&పిఆర్ మినిస్టర్ పార్థసారథి కి వినతి పత్రాలు అందించమని, రాష్ట్ర  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కలిసి మా సమస్యలను తెలియజేసేందుకు మీ సహకారం కావాలని కోరారు.  



తక్షణమే స్పందించిన  రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లి తప్పక రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్యమంత్రి వారితో ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చారు. 



ఈ కార్యక్రమానికి  రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ నిర్వహిస్తున్న యాజమాన్యం మరియు సిబ్బంది అధిక సంఖ్యలో విచ్చేసి అతిథులకు ఘనంగా సత్కరించారు.