ముస్లింల పక్షపాతి సీఎం చంద్రబాబు నాయుడు...
మైనార్టీలకు మళ్లీ మంచిరోజులొచ్చాయి...
ఇమామ్, మౌజన్లకు కూటమి ప్రభుత్వం వరం....
ఎమ్మిగనూరు టీడీపి మైనార్టీ నాయకులు హర్షం..
గత వైసీపీ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమన్ని గాలికివదిలేసింది..
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి, మరియు ముస్లిం నాయకులు..
ముస్లిం మైనార్టీల పక్షపాతి సీఎం చంద్రబాబు నాయుడు అని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఇందులో భాగంగా ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం విడుదల చేశారని టీడీపి మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు ఉసేన్ ఫీరా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనం విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మిగనూరు టీడీపి కార్యాలయంలో సీఎం చంద్రబాబుకు కృతజ్ఞత సభ, ప్రత్యేక దువా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడితూ ముస్లిం మైనారిటీలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని అన్నారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి, అభ్యున్నతికి మొదటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద పీట వేశారని తెలిపారు. రాష్ట్రంలో ఐదు వేల మసీదుల్లో ఇమామ్ లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు ఇచ్చేందుకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని, ఇది ముస్లింల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. అధికారం చేపట్టిన కేవలం ఎనిమిది నెలల కాలంలోనే ఇమామ్‌లు, మౌజన్ల ఆరు నెలల గౌరవ వేతనం రూ.45 కోట్లు విడుదల చేయడం పట్ల సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం అమలు కానీ హామీలతో మైనార్టీలకు మోసం చేసిందని, మైనార్టీల సంక్షేమన్ని గాలికివదిలేసింది ఆరోపించారు. మాజీ సీఎం జగన్ ముస్లింలకు మొండి చెయ్యి చూపారని విమర్శించారు. ఇమామ్ లకు, మౌజన్లకు గౌరవ వేతనం ఇవ్వకుండా ఇబ్బందులకు చేశారని, మైనారిటీ కార్పొరేషన్ కు నిధులు కేటాయించకుండా మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేశారని మండిపడ్డారు. మళ్లీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ముస్లింలకు పెద్ద పీట వేస్తున్నారని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.