విద్య&ఐటీ శాఖ మంత్రి రాక నేపథ్యంలో ఏర్పాట్లలను పరిశీలిస్తున్న పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థరు మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి మరియు జిల్లా అధికారులు, జిల్లా నాయకులు.
రేపటి రోజున 1/03/25 న మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మొదటి మంత్రాలయ పీఠాధిపతి సందర్భంగా ఆ వేడుకలకు గౌరవ ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య &ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంత్రాలయంకు వస్తున్న నేపథ్యంలో SRS మఠం ప్రాంగణంలో మరియు మఠం బయటహెలిపాడ్ మరియు గెస్ట్ హౌస్ ఏర్పాట్లను మంత్రాలయ రాఘవేంద్ర స్వామి పీఠాధిపతులు శ్రీ శ్రీ సుబుధేంద్ర తీర్థరు వారితో పాటు మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి , జాయింట్ కలెక్టర్ నవ్య, సబ్ కలెక్టర్ భరద్వాజ్, spl DSP ఉపేంద్ర, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంటటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు తిక్కరెడ్డి కె.యి ప్రభాకర్, మీనాక్షి నాయుడు, బిసి వెల్ఫేర్ చైర్మన్ నాగేంద్ర, మంత్రాలయం టెంపుల్ మేనేజర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రామాంజులు మఠం ప్రాంగణంలో జరుగుతున్న పనులను దగ్గరుండి పరిశీలించారు.
అనంతరం పీఠధిపతులు శుబుదేంద్ర తీర్థరు వారు రేపు మినిస్టర్ కు గవర్నమెంట్ GO పరంగా మరియు ఆలయ ఆచారాల ప్రకారంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.