కేంద్రంలో పెండింగ్లో ఉన్న వాల్మీకి బోయల ఎస్టీ బిల్లును పాస్ చేయించండి. రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బి లక్ష్మన్న.
కర్నూలు జిల్లా, మంత్రాలయం నియోజకవర్గం,మంత్రాలయం టౌన్ లో నారా లోకేష్ ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రిని కలిసిన మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్, రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ, రాష్ట్ర అధ్యక్షులు బి లక్ష్మన్న కేంద్రంలో పెండింగ్లో ఉన్న వాల్మీకి బోయల ఎస్టీ బిల్లు పాస్ చేసేందుకు కృషి చేయాలని నారా లోకేష్ కు రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ, రాష్ట్ర అధ్యక్షులు, మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బి లక్ష్మన్న విజ్ఞప్తి చేశారు.
గతంలోనే నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాల్మీకి బోయల ఎస్టీ బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగిందని తెలిపారు.ఇప్పుడు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కనుక ఈసారి గట్టిగా కృషి చేసి వాల్మీకి బోయల ఎస్టీ బిల్లును కేంద్రంలో పాస్ చేసే విధంగా గట్టి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బి లక్ష్మన్న విజ్ఞప్తి చేశారు. అలాగే లెటర్ ప్యాడ్ పై మెమొరడం ఇవ్వడం జరిగింది. ఈసారి తప్పకుండా కేంద్రంలో వాల్మీకుల ఎస్టీ బిల్లు పాస్ అయ్యేందుకు కృషి చేస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.