మహిళలను దగా చేసిన జగన్ రెడ్డి....

మహిళలను దగా చేసిన జగన్ రెడ్డి....

తల్లిని చెల్లిని గెంటేసిన వారికి మహిళలను అక్కా చెల్లెలు అనే అర్హత ఎక్కడిది:- మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి...

మహిళా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ 2025-26 బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమానికి 432 కోట్లు కేటాయించిన కూటమి ప్రభుత్వం.:-ఇంచార్జ్.



మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కార్యాలయంలో ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి పత్రికా ప్రకటనలో మాట్లాడుతు పార్టీ ఆవిర్భం నుండే తెలుగుదేశం మహిళా సాధికారతకు అత్యంత ప్రధాన్యత ఇస్తూ వచ్చింది. ఇంటిని సమర్థవంతంగా నడిపే మహిళ రాజకీయాల్లోనూ మరింత రానించి సత్తా చాటగలగానే గుర్తించిన అన్న ఎన్టీఆర్ గారు పురుషులతో సమానంగా మహిళలకు ఆస్తి హక్కును కల్పించారు. దానికి కొనసాగింపుగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళల ఆర్థిక స్వావలంబనకు డ్వాక్రా పథకానికి శ్రీకారం చుట్టి జీవన స్థితిగతులను మార్చారు. మహిళల పేరు మీద ఇల్లు పట్టాలు ఇంటి నిర్మాణం భూమి కొనుగోలు వంటి పథకాలు ఎన్నో ఆచారనాత్మకంగా అమలు చేసి చూపించారు. దీనికి కొనసాగింపుగా కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ 2025-26 బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమానికి ₹4332 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అదే వైసిపి ప్రభుత్వం లో ఉచితంగా ఇల్లు ఇస్తానని నమ్మించి మాట తప్పి ఓటిఎస్ పేరుతో ఒక్కో మహిళల దగ్గర 10,000 నుంచి 30,000 వరకు బలవంతంగా వసూలు చేసారు గత జగన్ రెడ్డి ప్రభుత్వం. 2014-19 టిడిపి ప్రభుత్వంలో ఆడబిడ్డకు అండగా నిలిచేందుకు తెచ్చిన పెళ్ళి కానుకను 2019-24 లో రద్దు చేసింది ఈ వైసిపి ప్రభుత్వం. దిశ పేరుతో డ్రామ తప్ప జగన్ పాలనలో ఆడబిడ్డకు రక్షణగా నిలిచిన రక్షణ వ్యవస్థ అసలు లేనేలేనిది. గడిచిన ఐదేళ్లలో 0 వడ్డీ రుణాలు పరిమితి 3 లక్షలు కాగా చంద్రబాబు ప్రభుత్వం దాన్ని 5 లక్షలకు పెంచింది.అలాగే ఈ వడ్డీ రాయితీ రుణాలను కూటమి ప్రభుత్వం త్వరలో 10 లక్షల రూపాయలకు పెంచనుంది. బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనారిటీ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేలా పెట్టుబడి రాయితీని 35% నుంచి 45% కు పెంచిన ఘనత మా కూటమి ప్రభుత్వందే. అలాగే ఎన్నికల హామీలో భాగంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం అంగన్వాడి ఆశావర్కర్లు ఎన్నాళ్ళగా ఎదురుచూస్తున్న గ్రాట్యుటీ చెల్లింపులకు శ్రీకారం చుట్టి అంగన్వాడీ గ్రాట్యూటీ చెల్లింపుల కోసం బడ్జెట్లో 60 కోట్ల కేటాయించినది ఏకైక కూటమి ప్రభుత్వం అని మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి పత్రికా ప్రకటనలో మాట్లాడడం జరిగింది.