జగన్ కు లేఖను అందజేసి, సమావేశానికి ఆహ్వానించిన డీఎంకే నేతలు.



వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన తమిళనాడు పీడబ్యూడీ శాఖ మంత్రి ఈ వి వేలు, రాజ్యసభ ఎంపీ విల్సన్‌. ఈ నెల 22న చెన్నైలో జరగనున్న దక్షిణభారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి వైయస్‌ జగన్‌ను ఆహ్వానించిన తమిళనాడు మంత్రి, ఎంపీ తమిళనాడు సీఎం  ఎం.కె. స్టాలిన్‌ రాసిన లేఖను అందజేసి, సమావేశానికి ఆహ్వానించిన డీఎంకే నేతలు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్‌ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపారు. ఇందులో భాగంగా తమిళనాడు డీఎంకే నేతలు శ్రీ వైయస్‌ జగన్‌ను కలిశారు.