'ఆశ'లను నిరాశ పరచకండి -వేతనాలు పెంచండి...యూనియన్ జిల్లా నేత జయప్రకాశ్ డిమాండ్...
జోగులాంబ గద్వాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలు కు తక్షణమే వేతనాలు పెంచాలని తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ (ఐ ఎన్ టి యు సి )జోగులాంబ గద్వాల జిల్లా ప్రెసిడెంట్ జయప్రకాశ్ డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా లోని ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లలో గత 20సంవత్సరాలు గా 607మంది ఆశా లు చాలీ చాలని నెలకు 9900రూపాయలు జీతాలు తో పనిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఎండనక, వాననక, చలి కి వణుకుతూ తట్టుకొని అహర్నిశలు కష్టపడి ప్రజలు కు అన్నీ వేళలా అందుబాటులో ఉంటూ వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా లకు కనీస వేతనం ప్రతి నెల 18000వేల రూపాయలు చెల్లించాలని ఆయన అన్నారు. ఆశా లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారిని ఆదుకోవాలని ఆయన అన్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశా లకు రాష్ట్ర ప్రభుత్వం 18000వేల రూపాయలు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలని ఆయన తెలిపారు. ప్రమోషన్, పి ఎఫ్, ఈ ఎస్ ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన చెప్పారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9వరకు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులు ఆశా లు రాష్ట్రము లో నిరవధిక సమ్మె చేశారని ఆయన గుర్తు చేశారు. 9-10-2023న సమ్మె సందర్బంగా హైదరాబాద్ లోని కోఠి కమిషనర్ ఆఫీస్ ముందు వేలాది మంది ఆశా లతో ధర్నా నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ధర్నా సమయంలో ఆనాటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు ఆశ యూనియన్ నాయకులతో చర్చలు జరిపి కొన్ని నిర్థిష్టమైన హామీలు ఇచ్చారని ఆయన అన్నారు. దాంతో ఆశా లు నిరవధిక సమ్మె ను విరమించారని ఆయన చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు సందర్బంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టో లో ఆశా లకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. 2024ఫిబ్రవరి 9న, జులై 30న, డిసెంబర్ 10న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ ఆఫీస్ ముందు ఆశా ల ధర్నా చర్చ ల సందర్బంగా ఆరోగ్యశాఖ కమీషనర్ స్పందిస్తూ ఆశా లకు 50లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తామని, అలాగే ఆశా లు మరణిస్తే మట్టి ఖర్చులకు గాను 50వేలు రూపాయలు ఇస్తామన్నారు అని ఆయన అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, సెలవులు కూడా ఇస్తామని, టార్గెట్ లను రద్దు చేస్తామని ఆ రోజు హామీలు ఇచ్చారని ఆయన అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశం లో నైనా రాష్ట్ర ముఖ్య మంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహా గారలు స్పందించి ఆశా లకు 18000వేల రూపాయలు వేతనం ఇస్తున్నామని ప్రకటన చేయాలని తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ (ఐ ఎన్ టి యు సి )జోగులాంబ గద్వాల జిల్లా ప్రెసిడెంట్ జయప్రకాశ్ విజ్ఞప్తి చేశారు.