రోడ్డున వెళ్లే ప్రజలకు మంచినీరు చలివేంద్రం



ఎండాకాలంలో రోడ్డున వెళ్లే ప్రజలకు మంచినీరు అందించి వారి దాహార్తి తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని జీవీఎంసీ 27వ వార్డు కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ గోలగాని వీరరావు (బుజ్జి) అన్నారు.



ఆదివారం సీతంపేట రాజేంద్రనగర్ హిందూ ముస్లిం కాలనీ లో దివంగత బాషీర్ బాబు (బాబుల) జ్ఞాపకార్ధం హిందూ ముస్లిం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని వీరరావు ప్రారంభించి అందరికీ మజ్జిగ, మంచి నీరు ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాలనీ పెద్దలు, యువత పాల్గొన్నారు.