మున్సిపాలిటీల్లో పన్నుల బాధుడు... ఇంటి పన్ను... నీటి పన్ను.. ప్రజలకు పన్ను పోటు
అమరావతి: మార్చ్ నెల రాష్ట్రంలో మండుటెండలు మొదలైనాయి. తీవ్ర ఎండలు మనుషులను ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పగలు ఎండలు, రాత్రులు దోమలతో కంటి మీదా కునుకు ప్రజలకు కరువైంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలలో పన్నుల బాదుడు ప్రారంభమైంది. ఆర్థిక సంవత్సరం చివరి నెల మార్చి కావడంతో ప్రతి ఏడాది మార్చ్ నెల ఇంటి పన్నులు, నీటి పన్నులు బిల్లులు చెల్లించాలని సచివాలయ అధికారులు ప్రజలకు తాకీదులిచ్చారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు పన్నులు కట్టించుకుంటున్నారు. ఇంటి పన్ను మార్చి నెలాఖరుకు కట్టకపోతే ఐదు శాతం టాక్స్ తో అదనపు పన్ను కట్టవలసి ఉంటుంది. రాబోయే సంవత్సరానికి ముందుగా కడితే 5% రాయితీ ఇస్తున్నారు. ఇక నీటి పన్నులు మామూలుగా లేవు. గత ప్రభుత్వం నీటి పన్ను అసలు వసూలే చేయలేదు. ఈ ప్రభుత్వం సంపదను సృష్టిస్తానని ప్రజలకు మాటిచ్చింది. ఆ మేరకు సంపదను సృష్టించే పనిలో పడింది. వివిధ శాఖల ద్వారా ప్రజల నుంచి ఎన్ని రకాల పన్నులు వసూలు చేయగలరో అన్ని రకాల పన్నులు వేయటానికి ప్రభుత్వం సిద్ధమైందని అర్థం అవుతుంది. లేదంటే బడ్జెట్ లేదు. ఏమి చేయలేము. ప్రజలు సహకరించాలని కూటమి ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. పన్నుల డ్రైవ్ లో భాగంగా నీటి పన్ను ఐదు సంవత్సరాలకుగాను కలిపి 6000 బిల్లు వచ్చింది. ప్రతి ఇంటి కులాయి లబ్ధిదారుడు 6000 ఒక్కసారిగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెలకి 15 వేల లోపు వచ్చే ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి ఎంత కడు దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వ్యవసాయ కూలీల పరిస్థితి ఇక చెప్పనవసరమే లేదు. ప్రతి నెల నీటి పన్ను 90 రూపాయలు వసూలు చేయవలసింది. చివరికి అది పెనాల్టీతో 100 రూపాయలు నెలకు అయ్యింది. సంవత్సరానికి 1200 అయింది. గత ఐదు సంవత్సరాలు బిల్లు ఒకేసారి వసూలు చేయడానికి ప్రభుత్వం పూనుకోవటం వల్ల 6000 అయ్యింది. ప్రతి గృహ యజమాని ఎన్ని కులాయిల కనెక్షన్స్ ఉంటే అన్ని ఆరువేలులు కట్టవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఇంటి పన్నులు కట్టే విషయంలో సాంకేతిక కారణాలవల్ల అనేక మంది కుటుంబాల యజమానులు ఇబ్బంది పడుతున్న సమస్యలు కూడా పెండింగ్లో ఉన్నాయి. గృహాలు క్రయ,విక్రయాల వల్ల, ఇంటి యజమానులు మరణించిన దాఖల ఇంటి కొళాయి కనెక్షన్ పేర్లు మారకపోవటం వల్ల పాత ఇంటి యజమానికి బిల్లులు అందించారు. మార్చ్ మంత్ అంటేనే ఇంటి పన్నులు, నీటి పన్నులు బాదుడు నెలగా మార్చ్ తయారయిందితయారైంది. ప్రజలకు భారంగా తయారైన ఇంటి పన్నులు, నీటి పన్నులు ప్రతినెల తేలిక పద్ధతులు వసూలు చేసే విధానం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. సంవత్సరానికి ఒకసారి, ఐదు సంవత్సరాలకు ఒకసారి అంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వాళ్ళకి చాలా కష్టతరంగా భావించాల్సి ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయమై మరోసారి పునరాలోచన చేసి, ప్రజలపై ఒకేసారి పన్నుల భారం పడకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వపై ఉందని ప్రజానీకం చర్చించుకుంటున్నారు.