దేశవ్యాప్తంగా ప్రజలకు నిత్యం ప్రజలకు ప్రధమ చికిత్స చేసి ప్రజల ప్రాణాలు కాపాడు తూ జీవనం సాగించుచున్న గ్రామీణ వైద్యులుకు ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు పార్టీ అధ్యక్షులు నాయకులు గ్రామీణ వైద్యులతో కలిసి తన సహాయ సహకారాలు అంది ఇవ్వాలని వేడుకుంటారు. గ్రామీణ వైద్యుడు ప్రజలకు చెబితే కచ్చితంగా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు ఆర్ ఏం పీ ల మాట వింటారని ప్రజలకు మీరు దేవునితో సమానమని మీ సహాయ సహకారాలు ప్రజలకి సమాజానికి ఎంతో అవసరమని మీరు లేకపోతే మేము లేము అని మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు మీ సమస్యలన్నీ పరిష్కరించి న్యాయం చేస్తామని హామీల వర్షం కురిపిస్తారు హత్తు కుంటారు.
నాటి నుండి నేటి వరకు జరుగుతున్న వాస్తవం హామీలను ప్రభుత్వం వచ్చిన వెంటనే నెర వేరుస్తారని గ్రామీణ వైద్యులు నమ్మి ఆ రాజకీయ పార్టీ నాయకులకు మద్దతు తెలిపి ప్రజలను కూడా గ్రామీణ వైద్యులు నమ్మిన పార్టీకి మద్దతు తెలుప వలసిందిగా కోరుతూ అఖండ విజయానికి మూల కారకులు గ్రామీణ వైద్యులు నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేస్తూ ప్రధమ చికిత్స తో ప్రజల ప్రాణాలను కాపాడుతూ తమ ప్రాణం సైతం లెక్క చేయగా ప్రజలు కు ప్రధమ చికిత్స చేయుటకు సుధీర ప్రాంతాలకు వాహనాలు కూడా వెళ్ళని ప్రాంతాలకు కొండలలో కోనలలో అడవి ప్రాంతంలో మురికివాడల్లో ప్రజల ప్రాణాలు కాపాడుట కొరకు ఎంత దూరమైనా కాలినడకన వెళ్లి ప్రథమ చికిత్స చేసి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న వారు గ్రామీణ వైద్యులు. ఆ విషయం గత ప్రభుత్వాలు అధికారులు నేడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏకగ్రీవంగా అంగీకరిస్తారు. కానీ గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరించే విషయంలో చిత్తశుద్ధి లేక మరల ఎన్నికల సమయం వరకు సమస్యలను పరిష్కరించరు. హామీలను నెరవేర్చాలని కోరిన కనీసం వారిని కలవడానికి కూడా వారితో సమావేశం అవ్వడానికి కూడా అవకాశం కల్పించడం లేదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నాటి నుండి నేటి వరకు జరుగుతున్నది ఇదే, అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు జరిగినప్పటికీ కనీసం గ్రామీణ వైద్యుల సమస్యల గురించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, కనీసం ఒక్క మాట కూడా మాట్లాడని పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంది. ఇచ్చిన హామీలను నెరవేర్చలని అనేక సందర్భాలలో కోరినప్పటికీ సమస్యలు పరిష్కారం కావడం లేదు అని గ్రామీణ వైద్యులు వాపోతున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో డాక్టరే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామీణ వైద్యులకు తరతరాలుగా వున్న వారి సమస్యలను అధ్యయనం చేసి అధికారులతో మంత్రులతో కలిసి ఒక ప్రణాళికను 429 జి వో గా ఇవ్వడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్న గ్రామీణ వైద్యులు అందరికీ జిల్లా వైద్యాధికారి జిల్లా ఆసుపత్రులలో ప్రథమ చికిత్స శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. కొంతవరకు శిక్షణ తరగతులు పూర్తి అయి పరీక్షలు నిర్వహించే సమయంలో దురదృష్టం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలగజేసింది తరువాతా వచ్చిన ముఖ్యమంత్రులు రాష్ట్రం విడిపోయిన తరువాత వచ్చిన ముఖ్యమంత్రి లు హామీల వరకే పరిమితం శాశ్వత పరిష్కారం చూపిన దాఖలు లేవు నేటికీ ప్రభుత్వం మారుతున్న నాయకులు ముఖ్యమంత్రి లు మారుతున్న ఎన్నికల సమయంలో మాత్రమే గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరించి తగు న్యాయం చేస్తామని హామీల ఇవ్వడం వరకే జరుగుతున్నది. నాటి నుండి నేటి వరకు అధికారులు నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి గ్రామీణ వైద్యుల సమస్యలను శాశ్వత పరిష్కారం చూపాలని తగువిధంగా చర్యలు తీసుకోవాలని సమస్యలు పరిష్కరించాలని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతు జాతీయ ఆర్ఎంపి పి.ఎం.పి సంఘాల సమైక్య అధ్యక్షులు కొండి శెట్టి సురేష్ బాబు విజయవాడలో తన కార్యాలయం నందు ఒక ప్రకటనలో తెలియజేశారు.