విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రి లో మార్చి 26వ తేదీన జర్నలిస్టుపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ఆధ్వర్యంలో ఈరోజు కడప కలెక్టరేట్ నందు జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ కు వినతి పత్రం అందజేస్తూ.. జర్నలిస్టులపై ఇటువంటి దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించాలని, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోరారు.
జర్నలిస్టుపై జరిగిన దాడిపై కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ వెంటనే స్పందించి ఈ సమాచారాన్ని ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి పంపడమైనది.
ఈ కార్యక్రమంలోకడప జిల్లా జై యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామచంద్రయ్య, హృదయ్ నాథ్, యూనియన్ నాయకులు సుబ్బరాయుడు, విజయ చంద్ర పాల్గొన్నారు.