ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి మరియు వారి తనయులు ఎన్. రాకేష్ రెడ్డి .
ముస్లిం సోదరులతో పాటు నమాజ్ లో పాల్గొని ముందుగానే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన ఇంచార్జ్ .
మంత్రాలయం మండలం మాధవరం గ్రామం లో ఈరోజు ముస్లిం సోదరులుకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి మరియు తనయులు తెలుగుదేశం పార్టీ నవయుగ నాయకులు ఎన్. రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఇంచార్జ్ ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమై నుండి ఎంతో నిష్టతో అత్యంత పవిత్రంగా ఉపవాస దీక్షలు చేస్తున్నారు, రేపటి వరకు రంజాన్ ఉపవాస దీక్షలు కొనసాగానున్నాయి. నెల రోజులపాటు చాలా పవిత్రంగా పరిశుభ్రంగా ఉంటూ ఇస్లాం ధర్మ సూత్రాలను పాటిస్తూన్నా ముస్లిం సోదర సోదరీమణులకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.