కార్మికులు, ప్రజల ప్రాణాలు అతి ముఖ్యం...

కార్మికులు, ప్రజల ప్రాణాలు అతి ముఖ్యం...ఓఎన్జీసీ అధికారులకు ఎంపీ హరీష్ స్పష్టమైన ఆదేశాలు.



అమలాపురం: మలికిపురం గొల్లపాలెం గ్రామంలో ని ఓఎన్జీసీ ప్లాంట్ లో నిర్వహణ పనులు నిర్వహిస్తున్న సమయంలో హైడ్రోజన్ సల్ఫైడ్ లీకేజీ కారణంగా 8 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారని తెలిసి అమలాపురం పార్లమెంటు సభ్యులు జీఎం హరీష్ బలయోగి ఆందోళన వ్యక్తం చేశారు ఘటన వార్త తెలిసిన వెంటనే ఓఎన్జీసీ అధికారులు, రెవిన్యూ, వైద్య సిబ్బందితో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులు అందరూ క్షేమంగా ఉన్నారని తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. అనారోగ్యానికి గురైన వారితో ఫోన్లో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని ఓఎంజీసీ అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని ఆర్డీఓ ని కోరారు.