ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకునే వారికి కీలక సూచనలు



అమరావతి: ఏపీలో ‘దీపం-2’ పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ తీసుకోని వారికి పౌర సరఫరాలశాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ కీలక సూచనలు చేశారు. ఈ నెలాఖరులోగా మొదటి సిలిండర్ ను బుక్ చేసుకోవాలని, లేదంటే మూడు సిలిండర్లలో మొదటిది కోల్పోతారని తెలిపారు. ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్ లు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 97లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.