ప్రయాణికులకు ముఖ్య గమనిక..

కాకినాడ మీదుగా విశాఖపట్నం వైపు బస్సులు నడిపే అన్ని డిపోల అధికారులకు, డ్రైవర్, కండక్టర్లకు విజ్ఞప్తి...



ది. 14.03.2025 అనగా శుక్రవారం నాడు చిత్రాడ గ్రామంలో జనసేన పార్టీ ప్లీనరీ సందర్భంగా కాకినాడ జిల్లా పోలీసు వారు కాకినాడ టు కత్తిపూడి రూట్ ను మార్పు చేసినారు. కావున ఆరోజున ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కాకినాడ నుండి తుని ,విశాఖపట్నం వైపు వెళ్ళు అన్ని బస్సులు కాకినాడలో బయలుదేరి జిజిహెచ్, ప్రతాప్ నగర్ ,సామర్లకోట ,దివిలి, కిర్లంపూడి, ప్రత్తిపాడు మీదుగా నేషనల్ హైవేలోకి ప్రవేశించి కత్తిపూడి, తుని ,అన్నవరం మీదుగా వెళ్ళవలెను. అలాగే కాకినాడ వచ్చేటప్పుడు కూడా అదే రూటులో అనగా కత్తిపూడి నుంచి ప్రత్తిపాడు, కిర్లంపూడి,, దివిలి సామర్లకోట మీదుగా కాకినాడ రావలెను. పైన చెప్పిన రూటును ఎటువంటి పరిస్థితులలోను అతిక్రమించరాదు. ఎటువంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా చూసుకోవాలని కోరడమైనది. 

ఇట్లు 

డిపో మేనేజర్ 

ఏపీఎస్ఆర్టీసీ

కాకినాడ....