ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రాం లో ఈరోజు రికార్డు బ్రేక్



విశాఖ గాజువాక పొలిస్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారథి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రాం ఈరోజు సాయంత్రం నిర్వహించగా గాజువాక పరిసర ప్రాంతాలలో విచ్చలవిడిగా బహిరంగంగా మద్యం సేవిస్తున్న 57 మందిని గుర్తించి గాజువాక పోలీస్ స్టేషన్ కు తరలించారు. 



ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారథి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా డీఎస్పీ ఆదేశాల మేరకు ఈ రోజు నిర్వహించిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రాం లో అత్యధికంగా 57 మంది బహిరంగంగా పబ్లిక్ ప్లేస్ లో మద్యం సేవిస్తూ దొరకడం ఇదే ప్రథమం అని తెలియజేశారు. వీరందరినీ ప్రెట్టి కేసు క్రింద నమోదు చేసి రేపు కోర్టు కి హాజరు పరుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సై, మరియు గాజువాక స్టేషన్ సిబ్బంది ని సీఐ పార్థసారథి అభినందించారు.