కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వాట్సాప్ గవర్నన్స్ ద్వారా ప్రజలకు అవగాహనా మరియు మెరుగైన సేవలు ప్రభుత్వ పథకలు విధానాలను సూచనలను మెరుగ్గా పనిచేసే విదంగా అధికారుల పనితీరు ఉండేలా చూడాలని చింతపల్లి మండలం తాసిల్దార్ రవికిరణ్ న్ని కోరిన చింతపల్లి మండలం కూటమి నాయకులు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తాసిల్దార్ రవికిరణ్ న్ని కలిసిన కూటమి నాయకులు మండలంలో ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలపై నివేదికనిస్తూ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రవేశపడుతున్న ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు చేరవేసే విధంగా అధికారుల పనితీరు ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు అనేకమంది ప్రజలు భూమి సర్వే చేసుకున్న ఎల్ పి నంబర్లు తమ ఆన్లైన్ సైట్ లో లేకపోవటంతో ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున ఆన్లైన్ సర్వే నంబర్స్ ఎంట్రీలను సరిచేసి భూమి పట్టా పుస్తకాలు జారిచేసే విదంగా చూడాలని కోరారు నూతన రేషన్ కార్డు ఇబ్బందులు ఆధార్ కార్డు లో మార్పులు మొదలుగు సమస్యలు తలెత్తకుండా చూడాలని కూటమి ప్రభుత్వం అధికారులకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ నూతన వాట్సాప్ గవర్నన్స్ ద్వారా ప్రభుత్వ విధానాలను సూచనలను మెరుగ్గా పనిచేసే విదంగా చూస్తుందని కనుక కూటమి ప్రభుత్వానికి ప్రజా ప్రయోజనమే ముఖ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో చింతపల్లి మండలం టీడీపీ అధ్యక్షులు పూర్ణచంద్ర మరియు సీనియర్ టీడీపీ నాయకులు రెమెల ఆనంద్ చింతపల్లి మండలం బీజేపీ పార్టీ అధ్యక్షులు సాగిన.బాలకృష్ణ మరియు బీజేపీ పార్టీ అరకు పార్లమెంట్ కిసాన్ మోర్చా ప్రధానకార్యదర్శి /బీజేపీ పార్టీ ఏ.ఎస్.ఆర్.జిల్లా సోషల్ మీడియా కన్వినర్ దుక్కేరి.ప్రభాకరరావు మరియు బీజేపీ పార్టీ గిరిజన మోర్చా మండలం అధ్యక్షులు వి.చిన్నారావు తదితర టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.