ఐ సి యూ వార్డుకి మార్పించినా దుక్కేరి.ప్రభాకరరావు

విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్ లో పేసెంట్ కి సక్రమంగా వైద్యం అందట్లేదు అని ఫోన్ ద్వారా తెలపడంతో చింతపల్లి నుండి ఊట ఉటిగా కేజీహెచ్ హాస్పిటల్ కి వెళ్లి పేసెంట్ నీ పరామర్శించి వైద్యులతో  మరియు ఏ.ఎస్.ఆర్.జిల్లా డీఎంహెచ్ఓ ఏ.బాషాతో  మరియు ట్రైబల్ సెల్ డాక్టర్ తో మాట్లాడి పేసెంట్ కు మెరుగైన వైద్యం  కోసం ఐ సి యూ వార్డుకి మార్పించినా బిజెపి పార్టీ అరకు పార్లమెంట్ కిసాన్ మోర్చా ప్రధానకార్యదర్శి దుక్కేరి.ప్రభాకరరావు.



అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం రింతడ పంచాయతీ పరికల గ్రామానికి చెందిన కిల్లో.సన్యాసిరావు(31/M) గత కొంతకాలంగా గుండె సంబంధిత రక్త ప్రసరణ లోపించి మనషి మొత్తం పొంగిపోతు అనారోగ్యంతో బాధపడుతూ చింతపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి వైద్యులు కేజీహెచ్ హాస్పిటల్ కి మెరుగైన వైద్యం కోసం పంపించడం జరిగింది కెజిహెచ్ హాస్పిటల్ కి వైద్యం కోసం వెళ్లిన కిల్లో.సన్యాసిరావు ఒకటిన్నర రోజులు పూర్తవుతున్న పేషెంట్ ని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు తప్ప మెరుగైన వైద్యం అందించట్లేదని పేసెంట్ తాలూకా కుటుంబ సభ్యులు ఫోన్ ద్వారా తెలపడంతో చింతపల్లి నుండి కేజీహెచ్ హాస్పిటల్ కి వెళ్లి పేసెంట్ నీ పరామర్శించి కె జీ హెచ్ హాస్పిటల్ వైద్యులతో  మరియు ఏ.ఎస్.ఆర్.జిల్లా డీఎంహెచ్ఓ ఏ.బాషాతో  ట్రైబల్ సెల్ డాక్టర్ తో మాట్లాడి పేసెంట్ కు మెరుగైన వైద్యం అందించాలని బిజెపి పార్టీ అరకు పార్లమెంట్ కిసాన్ మోర్చా ప్రధానకార్యదర్శి  దుక్కేరి.ప్రభాకరరావు కోరిన వెంటనే పేషెంట్ ని ఐ సి యూ వార్డుకి మార్చి మెరుగైన చికిత్సను అందిస్తున్న వైద్యులకు కిల్లో. సన్యాసిరావు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.