AP : రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి పదోతరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో RTC యాజమాన్యం సిబ్బందికి పలు సూచనలు చేసింది.పదోతరగతి విద్యార్థుల వద్ద బస్ పాస్ లేకపోయినా హాల్ టికెట్ చూసి పల్లె వెలుగు/ అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కించుకోవాలని ఆదేశించింది. పబ్లిక్ హాలిడే రోజుల్లోనూ పరీక్షలు ఉంటే అనుమతించాలని పేర్కొంది. ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి.